టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సూపర్ స్టార్లుగా రాణిస్తున్నారంటే ఆ ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అలాంటి రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఏ సినిమా అయినా.. ఆయన డామినేషన్ కనిపిస్తుంది. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఏకంగా రాజమౌళి డైరెక్షన్‌ను తన పర్ఫామెన్స్‌తో డామినేట్ చేశాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు మాస్ మహారాజు రవితేజ. రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో విక్రమార్కుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర.. ఈ సినిమా సంచాలనంగా నిలిచింది. సాధారణంగా అన్ని సినిమాలకు సక్సెస్ క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. కానీ.. విక్రమార్కుడు సినిమాకు మాత్రం రవితేజ యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. నార్త్ జనాలు కూడా రవితేజ నటనకు ఫిదా అయ్యారు. తర్వాత ఈ సినిమాను పలు భాషలో రీమేక్ చేసి రిలీజ్ చేసినా.. రవితేజ రేంజ్‌లో ఏ హీరో నటించలేకపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో వివరించాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో మెరిశాడు. విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు ఇలా దొంగ పోలీస్ పాత్రలో కనిపించగా.. హీరోయిన్గా అనుష్క నటించింది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా 2006లో రిలీజై ఏకంగా 54 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఘనత సొంతం చేసుకుంది. ఇక రూ.19.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో రూ.25 కోట్ల పైగా కలెక్షన్లకు కొల్లగొట్టి మేకర్స్‌కు లాభాలు కురిపించింది.