టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న చిరు.. విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాహో గారపాటి, సుస్మిత నిర్మాతలుగా ఈ సినిమాకు వ్యవహరించినట్లు క్లారిటీ ఇచ్చేశాడు చిరు.
ఇక ప్రస్తుతం శ్రీకాంత్.. నానితో ది పారడైజ్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ తర్వాతే చిరంజీవితో సినిమా మొదలు పెట్టనున్నారని సమాచారం. అయితే విశ్వంభర పూర్తి కాగానే చిరంజీవి.. అనిల్ రావుపూడి సినిమా సెట్లో అడుగుపెట్టనున్నడట. ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ఇప్పటికే ప్రారంభించేశారు మేకర్స్. ఇక సెంటిమెంట్‌గా ఈ నెల 17 ,18 తేదీలో వైజాగ్‌లో ఈ సినిమాకు.. ఓం రాసి స్టోరీ డిస్కషన్లు ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని రావిపూడి స్వయంగా వెల్లడించారు. ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్‌గా సినిమా రూపొందనుందని.. ఈ ఏడాది సమ్మర్‌లో సెట్స్‌పైకి రానుందంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి కథను విన్నాను అని చిరంజీవి కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్‌కి ముందు నుంచి సక్సెస్‌ఫుల్‌గా నెలరోజులు పూర్తి చేసుకునే వరకు ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. సోమవారం జరిగిన విక్టరీ వేడుకతో సినిమా ప్రమోషన్స్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ చిరంజీవి సినిమా పైన ఆయన దృష్టి అంతా పెట్టనున్నాడు అనిల్.