భారతదేశంలో హిందు వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తారు. సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహాలు చేసుకుని జీవితాంతం ఆ బంధం పై నిలబడతారు. ఇక అరేంజ్ మ్యారేజ్ గురించి చెప్పనవసరం లేదు. ముక్కు, ముఖం తెలియకపోయినా.. పెళ్లి చూపుల వరకు ఒకరికి ఒకరు సంబంధం లేకున్నా.. ఒకసారి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత జీవితాంతం వారితోప్రేమగా కలిసి ఉంటారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే.. ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్లతో జీవితాన్ని గడపడం అంటే అది నిజంగా స్వర్గమే. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రస్టింగ్ కపుల్ గురించి మనం మాట్లాడుకుంద్దాం.
టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ హీరో.. 27 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ జంట ఎవరు కనిపెట్టారా.. వాళ్ళు ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి. ఇప్పటికే వెళ్ళ వివాహమై 14 ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ అదే ప్రేమానురాగాలతో.. అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్‌గా ఎన్టీఆర్ మ్యారేజ్ ఎప్పటికి నిలిచిపోతుంది. వీళ్ల పెళ్లికి దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక ప్రణతి ప్రస్తుత ఏపీ సీఎం.. నారా చంద్రబాబునాయుడుకి మేనకోడలు వరుస అవుతుందన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఇక వీళ్ళు ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు.. దాదాపు 15వేల మందికి పైగా జనం హాజరయ్యారు. సినీ సెలబ్రెటీస్, రాజకీయ నాయకులు, బిజినెస్ మాన్యులు, ఫ్యాన్స్ ఇలా ఇసుక వేస్తే రాలనంత జనం సందడి చేశారు. కాగా.. వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2014లో అభయ్ రామ్ జన్మించగా.. 2019లో భార్గవ్ రామ్ జన్మించాడు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తుల విలువ ఏకంగా రూ.500 కోట్లని తెలుస్తుంది. కాగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్ ప్రస్తుతం.. తన ఒక్కో సినిమాకు రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. దేవర సీక్వెల్‌తో పాటు, హృతిక్ రోషన్ వార్ 2, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తు బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.