ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీలుగా క్రేజ్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి అభిమానులు ఉండడం కామన్. అందులో ముఖ్యంగా స్టార్ హీరోలకైతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. చాలామంది స్టార్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలాంటి ఓ డై హార్ట్ ఫ్యాన్ తన ఫేవరెట్ హీరో కోసం తీసుకున్న డెసిషన్ సెన్సేషనల్ గా మారింది. ఆ వ్యక్తి చనిపోయే ముందు ఏకంగా రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తిని తన ఫేవరెట్ హీరోకు రాసిచ్చేయడం ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ రాసిచ్చిన డై హార్ట్ ఫ్యాన్ ఎవరు.. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.
ప్రస్తుతం టాలీవుడ్‌లోను పలు సినిమాల్లో బిజీగా గడుపుతున్న సంజయ్ దత్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక సంజయ్ దత్‌కు ముంబైకి చెందిన నిషా పాటేల్ అనే అమ్మాయి డై హార్ట్ ఫ్యాన్. సంజయ్ దత్ అంటే ఆమెకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమట. ఆయన నటన నైపుణ్యానికి అమ్మడు ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే అతనికి డై హార్ట్ ఫ్యాన్ గా మారిన నిషా.. వ్యక్తిగతంగా ఆయనను కలవాలని ఎన్నోసార్లు భావించిందట. కానీ.. అది వర్కౌట్ కాలేదు. అయినా ఆమె ఎప్పటికప్పుడు అయనను ఆరాధిస్తూ వచ్చేది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం అనారోగ్యం పాలైన నిషా.. తన చావును ముందే గెస్ చేసి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2018లో ఆమె తన ఫేవరెట్ హీరో పేరిట ఏకంగా రూ.72 కోట్ల ఆస్తిని వీలునామాగా రాసేసింది.
అలాగే తన డబ్బు, నగలు, ఆస్తి అన్ని సంజయ్ దత్‌కు చేరుకోవాలని.. ఇది తన చివరి కోరిక అంటూ వివరించింది. ఈ మేరకు చనిపోయే ముందు బ్యాంక్ అధికారులకు కూడా లెటర్స్ పంపించింది. ఇటీవల నిషా పటేల్ అనారోగ్యంతో మృతి చెందడం.. ఇక ఆమె రాసిన వీలునామా ప్రకారం తన పేరిట ఉన్న ఆస్తినంతా హీరో సంజయ్ దత్‌కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. అసలు ఎవరు నిషా పటేల్ అని ఎంక్వయిరీ చేసిన ఆయన.. ఈ ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఆమె ఆస్తి వద్దని చెప్పి.. అభిమానానికి మించిన ఆస్తి ఉండదంటూ చెప్పుకొచ్చాడు. అలాంటి అభిమానిని కలుసుకోలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని సంజయ్ దత్ వివరించాడు. ఇక ఆమె రాసిన రూ.72 కోట్ల ఆస్తిని వారి కుటుంబ సభ్యులకి చెందేలా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించాడు. ఇక సంజయ్ దత్ నిర్ణయం ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. సినీ ప్రియులతో పాటు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.