ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ నటిగా, మోడల్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గాను వ్యవహరించన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జానీ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. కొంతకాలానికి పవన్‌తో ప్రేమలో పడిన ఈ అమ్మడు అతని వివాహం చేసుకుంది. వీరికి ఆఖీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. పెళ్లయిన కొంతకాలానికి మనస్పర్ధలతో విరు విడాకులు తీసుకున్నారు. అలా చాలాకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచిన్న రేణు దేశాయ్.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలలో నటిస్తుంది.
అంతేకాదు సోషల్ మీడియాలను ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబర్ పై రేణు మండిపడింది. ప్రస్తుతం స్టాండ్ అప్ కామెడీ, ఇన్ఫ్లుయెన్సర్, పాడ్ కాస్ట్ అనే పేర్లతో చాలామంది యాంకర్లు చెత్తవాగుడు వాగుతు అసభ్యకరంగా పదజాలాన్ని ఉపయోగించడం ఎక్కువైపోయింది. ఇటీవల అలాంటి ఓ సంఘటనపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేణు దేశాయ్.. యూట్యూబర్ రన్వీర్ అలహాబాదియా ఫైర్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.
మంచిగా పెంచండి.. వారి మంచి మార్గంలో ఉండేలా చూసుకోవాలంటే మాత్రం ఇలాంటి వెధవలకు దూరంగా ఉండాలి. వారిని అన్ ఫాలో చేసి యంగ్ జనరేషన్ కోసం మనం ఎంతో బాధ్యతగా ఉండడం మంచిది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే క్యాటగిరీ కింద వలిగారిటీని ప్రస్తుతం యూత్ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటూ వివరించింది. అయితే ఇది విన్న వారంతా రన్వీర్ అలహాబాదియాతో పాటు షోలో పాల్గొన్న అపూర్వ, సమయ్ రైనాదిపై కూడా తప్పు ఉందని.. ముగ్గురికి తగ్గ శిక్ష పడాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ ఇలాంటి క్రమంలో అతని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.