ఇంకెన్నాళ్లు ఆ సినిమా పేరు చెప్పుకొని వేలాడుతావ్.. అనిల్ రావిపూడికి షాకింగ్ కౌంటర్.. !

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎక్కడకు వెళ్లిన ఒకే ఒక్క సినిమా పేరు వినిపిస్తుంది. అదే సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల పరంగానే ఇరగదీసింది. అయితే ఈ సినిమా ట్రైలర్తో ఆకట్టుకోకున్నా.. రిలీజై బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం.. ఇప్పటికి థియేటర్ల‌లో సినిమా ఆడడంతో మరోసారి వెంకీ మ్యాజిక్ రిపీట్ చేశాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సినిమా క్రెడిట్ వెంకటేష్తో పాటు డైరెక్టర్ కూడా పడింది. చాలా రోజుల తర్వాత వెంకటేష్ ఖాతాలో బ్లాక్ బ‌స్టర్ హిట్ పడడానికి అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా కారణమంటూ ఫ్యాన్స్ ఆనంద వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ఎక్కడకు వెళ్లినా కూడా మొదట సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడడం.. ఆ సినిమాకు సంబంధించిన టాపిక్‌నే తలుచుకుంటున్నాడు. దీ్తో విసిగిపోయిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కౌంటర్ వేశాడు. తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ ఈవెంట్ లో గెస్ట్‌గా అనిల్ రావిపూడి సందడి చేశాడు.

Chiranjeevi and Anil Ravipudi Movie Confirmed By Producer Sahu Garapati |  Laila Movie Trailer Launch - YouTube

ఈవెంట్లో కూడా అనిల్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పుకొచ్చాడు. అక్కడే ఉన్న ప్రొడ్యూసర్ సాహు గార్ల పార్టీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నీ పబ్లిసిటీ ఆపు. ఇంకెన్ని రోజులు ఆ సినిమా పేరు చెప్పుకొని వేలాడుతావు.. ఇప్పటికైనా ఆపేసి మన సినిమాలోకి ఎప్పుడొస్తావో చెప్పు అని అర్థం వచ్చేలా కౌంటర్స్ వేశాడు. ఇక ఆయన కౌంటర్‌కి అనిల్‌ రియాక్ట్ అవుతూ.. సారీ ఇప్పటినుండి మిమ్మల్ని ఇబ్బంది పెటద‌లుచుకోలేదు.. ఇంకా ఒక ఈవెంట్ ఉంది అది అయిపోయాక.. అన్నయ్య సినిమా పైన పూర్తి కాన్సన్ట్రేషన్ పెడతా అంటూ అనిల్ రావిపూడి వెల్లడించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడికి ప్రొడ్యూసర్ సాహు గార్లపాటి ఇచ్చిన షాకింగ్ కౌంటర్ నెట్టింట వైరల్‌గా మారుతుంది.