టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు మరోసారి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడని.. అందుకే రాజకీయ పెద్దలతో కలుస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ తాజా ఈవెంట్లో చిరంజీవి దానిపై రియాక్ట్ అయ్యారు. ఇక ఈవెంట్లో చిరు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. తను రాజకీయాల వైపు మళ్లీ వెళ్లబోతున్నాను అంటూ పలువురు భావిస్తున్నారని.. జీవితాంతం కళామ్మతల్లి సేవలోనే ఉండబోతున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు. సినీ రంగానికి ఏదైనా సేవలు కావాలంటే రాజకీయ పెద్దలను కలుస్తాను తప్ప.. అంతకుమించి ఏ ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు.
రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు నా తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. హైదరాబాదులో జరిగిన బ్రహ్మానందం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి జీవితాంతం రాజకీయాలకు దూరంగానే ఉంటానని.. సినిమాలకు దగ్గరగా ఉంటానని.. పెద్దపెద్ద వారిని కలుస్తున్నాడేంటి.. మళ్లీ రాజకీయాల వైపు వెళ్తాడేమో అని సందేహాలు ఏమి పెట్టుకోవద్దు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నా.. మరోపక్క సినిమాలకు శాశ్వతంగా దగ్గరగా ఉంటానంటూ చేసిన కామెంట్స్ వారికి ఆనందాన్ని కల్పించాయి. ఇక బ్రహ్మానందం ఆయన కొడుకు రాజు గౌతమ్.. తాత, మనవళ్ళుగా నటించిన సినిమా బ్రహ్మానందం.
ప్రియ వడ్లమని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో.. చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా సందడి చేశారు. ఇటీవల జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చిరు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. నేను తప్ప ఇంకెవరూ లేరా అని మీకు అనిపించవచ్చు.. ఎక్కువ సినిమాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే ప్రమోషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సినిమా కథ ఎంత ముఖ్యమో.. దాని రిలీజ్ తేదీ కూడా అంతే స్పెషల్.. ప్రేక్షకులకు సినిమాలో చేయడం అత్యంత ఇంపార్టెంట్. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల అద్భుతంగా సినిమా ప్రచారాలను ప్లాన్ చేశాడు. ఎక్కడ చూసినా ఈ మూవీ టీం కనిపించేది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.