మ్యారేజ్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ చెల్లెళ్లు.. అన్నకు కూడా పెళ్లి చేయండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ అంతా హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే.. అది రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి అనే చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది హీరో నాగచైతన్య కూడా వివాహం చేసుకున్నారు. అంతేకాదు ఆయన తమ్ముడు అఖిల్ కూడా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అలా దాదాపు ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలు అంత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి లైఫ్ ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ.. ఒక్క రెబల్ స్టార్ మాత్రమే ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోయాడు. టాలీవుడ్ ఫ్యాన్స్ కు ఇప్పటివరకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది ప్రభాస్ పెళ్లి మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబం కంటే.. అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌లో ఏదో సందర్భంలో ఈ టాపిక్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ప్రభాస్ బంధువుల పెళ్ళిలో ఆయన ముగ్గురు చెల్లెళ్లు సందడి చేయడమే. వారితో పాటు.. కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కూడా మెరిసారు. ఇక పెళ్లిలో వాళ్లంతా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే మీ అన్నకు కూడా పెళ్లి చేయ‌వచ్చు కదా అంటూ.. ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడో చెప్పండి అంటూ.. అభిమానులు రిక్వెస్ట్ మొదలుపెట్టారు.

ఇటీవల జరిగిన ఓ రిలేటివ్స్ ఫంక్షన్‌లో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవితో పాటు.. కూతుళ్లు ప్రసీద్దా, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా హాజరై సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కలిసి ఈ దిగిన ఫోటోలను ప్రసిద్ధ ఉప్పలపాటి తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఇవి చూసిన ఫ్యాన్స్.. ప్రభాస్ అన్నకు కూడా త్వరగా పెళ్లి చేసేయండి సిస్టర్ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు.. ఫ్యాన్స్ కామెంట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం ప్రసీద్దా తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్న సంగతి తెలిసిందే. మిగిలిన ఇద్దరు సిస్టర్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.