టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. ఇక ఆర్సి16 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు.. బుచ్చిబాబు సన్నా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిజాస్టర్ ఎదురుదెబ్బ నుంచి త్వరగానే కోలుకొని.. షూటింగ్‌కు పాల్గొంటున్నాడు. హై ఫీవర్ టైం లో కూడా రాత్రులు ఎముకలు కొరికే చలిలో షూటింగ్లో పాల్గొని సందడి చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా కోసం ఆయన పడుతున్న కష్టానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సినిమాల్లో చాలా బలమైన కంటెంట్ ఉందని.. రంగస్థలంని మించే రేంజ్‌లో ఈ సినిమా చరణ్ కెరీర్‌కు మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోతుందని.. రామ్ చరణ్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.
ఇలాంటి క్రమంలో సినిమా టైటిల్ విషయం అభిమానులను కాస్త టెన్షన్ పెడుతుంది. చరణ్ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ టైటిల్‌కి అస్సలు సంబంధం ఉండడం లేదంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టనున్నారని వార్తలు వినిపించినా.. ఇప్పుడు పవర్ క్రికెట్ అనే టైటిల్‌ని పెట్టేందుకు ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం క్రికెట్ పై ఉంటుందని.. సెకండ్ హాఫ్ కుస్తీపై ఉండనుందని.. దీంతో రెండు పేర్లు కలిసి వచ్చేలా పవర్ క్రికెట్ టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఫ్యాన్స్‌కు మాత్రమే ఈ టైటిల్ అసలు సహించటం లేదు. దీనికన్నా పెద్ది టైటిలే బాగుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పవర్ క్రికెట్ అనే టైటిల్ సీరియస్ టోన్‌లో లేదని.. ఇలాంటి సినిమాలకు అలాంటి టైటిల్స్ అసలు వర్కౌట్ కావని.. ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టం అంటూ దయచేసి ఈ టైటిల్ మాత్రం పెట్టవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు జనం. మరి ఆడియన్స్ అభిప్రాయం టీం వరకు చేరుతుందా.. లేదా ఎలాంటి టైటిల్ను పెడతారో వేచి చూడాలి. విరామం లేకుండా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్ సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి.. ఈ ఏడది అక్టోబర్ నెలకల్లా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది నటీనటులు కనిపించనున్నారు అని టాక్. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో స్పెషల్ రోల్‌కు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కీలకపాత్రలో మెరవనున్నాడని టాక్.