నా కొడుకు – కోడలి ముందు అలాంటి వీడియోలు చూపించొదయ్య.. నాగార్జున రిక్వెస్ట్

తాజాగా అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్ రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్‌ను గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాటు చేశారు ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా నాగార్జున వచ్చి సందడి చేశౄడు. ఇందులో భాగంగానే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నాగార్జున.. మాట్లాడుతూ ఈ సినిమా విజయం చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించిందని వెల్లడించాడు. ఇక 7వ తారీకున నేను మోదిని కలవడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాన‌ని.. అక్కడ సెక్యూరిటీ మా ఫోన్లు తీసేసుకున్నారు.. ఫోన్ దగ్గరే ఉండి ఉంటే ఫోన్ కాల్స్, మెసేజ్లు చూస్తూ చైతన్య ఫేస్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నా.. కానీ వాడు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు.

తర్వాత మేము బయటకి రాగానే.. నా ఫోన్ చూసా. కంగ్రాట్స్ ప‌ప్ప, కంగ్రాట్స్ డాడీ అంటూ వరుసగా ఫోన్ కాల్స్, ఫ్యాన్స్ మెసేజెస్.. నాకంటే, చైతన్య కంటే కూడా మా అభిమానులు, శ్రేయోభిలాషులే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతగా ఆనందిస్తున్నారో అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జునను స్టేజ్ పైకి ఆహ్వానించే ముందు ఆయన సినిమాలకు సంబంధించిన ఏవీ ని తండేల్ టీం ప్రదర్శించారు. అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండడం పై నాగార్జున రియాక్ట్ అవుతూ.. నా కొడుకు, కోడలు ముందు అలాంటి వీడియోలను అస్సలు చూపించవద్దు అంటూ సరదా కామెంట్స్ చేశాడు. అరవింద్ గారు ఆ కథ విన్న వేళా విశేషం. డైరెక్టర్గా చందుని, హీరోగా నాగచైతన్య‌ను తీసుకున్న వేల విశేషం, చైతన్య.. శోభితను పెళ్లి చేసుకున్న వేల విశేషం.. ఇవన్నీ సినిమా సక్సెస్‌కు కారణమయ్యాయి అంటూ కామెంట్లు చేశాడు.

ఇక అల్లు అరవింద్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. ఇండియాలోనే మొట్టమొదటి రూ.100 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన సినిమాకు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్. గజినీతో ఆయన సక్సెస్ అందుకున్నాడు. 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్‌ ఇలా.. మాకు మీరు మూడు సక్సెస్‌ఫుల్ సినిమాలు ఇచ్చారు. అల్లు, అక్కినేని ఫ్యామిలీలకు బాగా కుదిరింది. దర్శకుడు చెందుతో నేను సినిమా చేయకపోయినా.. అతడు టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చాడు. నాగార్జున తండేల్‌ ద్వారా చైతన్యలో నటుడిని బయట ప్రేక్షకులకు చూపించాడని.. ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం నాగార్జున కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి.