టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరలో బిజీగా ఉన్నాడు. ఇటు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సక్సస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా సట్స్‌పైకి రానుంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్‌గా రిలీజ్ కానుందని. ఈ ఏడాది వేసవి నుంచి సినిమా ప్రారంభంనుందని చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించారు. ఇక సినిమాను చూసే అంతసేపు ఆడియన్స్ కడుపుబ్బ నవ్వుకునేలా సన్నివేశాలు ఉండనున్నాయని.. కథ చెప్పినప్పుడు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. తనకు కూడా ఎప్పుడెప్పుడు ఆ సినిమా నటించాలా అని ఆసక్తిగా ఉందంటూ ఆయన వెల్లడించాడు. ఇక అనిల్ రావిపూడితో సినిమాను స్వయంగా చిరు ప్రకటించడం మెగా అభిమానులకు ఆనందాన్నిస్తుంది.
ఈ క్రమంలో వీరిద్దరి కాంబోకు ఏం టైటిల్ పెట్టనన్నారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా.. తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాఘవేందర్రావు ఓ టైటిల్ కాంబోకు సజెస్ట్ చేస్తూ స్టేజిపై కామెంట్ చేశారు. వెంకటేష్ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హై సక్సెస్ అయిన క్రమంలో.. మూవీ టీం విక్టరీ వేడుకలు నిర్వహించగా.. దీనికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హరీష్‌శంకర్, వంశీ పైడిపల్లి స్పెషల్ గెస్ట్లు గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే చిరుతో రాబోయే సినిమాకు సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ రాఘవేంద్రరావు స్టేజ్ పై చెప్పుకొచ్చాడు. ఆ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ సంక్రాంతి సీజన్‌ను వదిలిపెట్టొద్దని అనిల్‌కు చెప్పాగు.
ఇదే చెప్తున్నా.. చిరుతో ఆయన తెరకెక్కించబోయే సినిమా పేరు సంక్రాంతి అల్లుడు అని పెడితే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. తను తెరకెక్కించిన సినిమా ఇండస్ట్రీకి అసలు సంక్రాంతి తెచ్చిపెట్టింది. ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలతో ఓ సినిమా ప్రదర్శితం అవడం చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను అంటూ రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు ఐశ్వర్య , మీనాక్షి నటన అద్భుతంగా ఉందని… వెంకటేష్ బయట సైలెంట్ గా కనిపించిన, ఇద్దరు హీరోయిన్లతో తెరపై బాగా సందడి చేస్తాడు. భీమ్స్ సంగీతం సినిమాకు మరింత హైలెట్గా నిలిచింది. ఇక అనిల్, బీమ్స్ కాంబోలో మరిన్ని సక్సెస్‌లు రావాలని కోరుకుంటున్నా. చిరంజీవి హీరోగా తాను తెరకెక్కించబోయే సినిమాకు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని.. అనిల్ నాతో అన్నాడు అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చాడు.