నాగ వంశీకి నైజాంలో గట్టి ఎదురు దెబ్బ.. చిక్కుల్లో డాకు మహారాజ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్.. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో నాగ వంశీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందంటూ డాకు మహారాజ్ కు నైజాంలో చిక్కులు తప్పవంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి అనుకుంటున్నారా అదే థియేటర్ల విష‌యంలో ఇబ్బంది ప‌డ‌ల్సి వ‌స్తుంద‌ట‌. ఏంటి బాల‌య్య సినిమాకు ధియేట‌ర్‌ల స‌మ‌స్య‌ నాగవంశం లాంటి స్టార్ ప్రొడ్యూసర్, దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ ఉన్న సినిమాకు థియేటర్లో సమస్య ఏంటి అనుకుంటున్నారా.. అది ఎంత పెద్ద సినిమా అయినా సంక్రాంతి బరిలో రిలీజ్ అంటే కచ్చితంగా ధియేటర్ల సమస్య ఎదురకొక తప్పదు.

ఈ క్రమంలోనే ఈసారి నైజంలో మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. మూడు సినిమాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు అని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు డాకు మహారాజుకు థియేటర్ల స‌మ‌స్య త‌ప్ప‌ద‌ట. నైజం లో మూడు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో రెండు సినిమాలుకు ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈ క్రమంలో నైజంలో 150 థియేటర్ల వరకు ఏషియన్ సురేష్ చేతిలో ఉన్నాయి. అంటే సురేష్ బాబు పార్ట్నర్ గా ఉన్న క్రమంలో.. ఆయన తమ్ముడు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్కువగా వాళ్ళ థియేటర్లలో ఆడేలా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ముందుగా జ‌న‌వ‌రి 10న గేమ్ ఛేంజర్‌ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Sankranthiki Vasthunam is set to release with four day gap from Game Changer  during Sankranthi 2025 | Sankranthiki Vasthunam Vs Game Changer:  సంక్రాంతికి వస్తున్న వెంకీ మామ... 'గేమ్ చేంజర్'తో ఇష్యూ ...

జ‌న‌వ‌రి 12న‌ డాకు మహారాజ్ వస్తుంది. కొన్ని థియేటర్లు తీసి డాకు మహారాజ్ కీ ఇస్తారు. అయితే ఎన్ని థియేటర్లు డాకు మహారాజ్ కి ఇస్తారనేది మాత్రం కొంతవరకు సందేహమే. ఇలా తీసిన థియేటర్లలో మళ్ళీ 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కొన్ని ఇచ్చేయాలి. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. దిల్ రాజుకు అన్ని సినిమాల కంటే గేమ్ ఛేంజర్ స‌క్స‌స్ ముఖ్యం. అదే సమయంలో ఏషియన్ సురేష్ కు సంక్రాంతికి వస్తున్నాం ఇంపార్టెంట్. మధ్యలో అటు ఇటు కాకుండా డాకు మహారాజ్‌ చిక్కులు ఎదురయ్యాయి. పైగా నైజంలో బాలయ్య మార్కెట్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతి వస్తున్నాంకు ఎక్కువ థియేటర్లు కేటాయించగా.. డాకు మహారాజ్‌కు థియేటర్లు సమ‌స్చ‌ ఏర్పడుతుందని అంటున్నారు.