టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా మంచి బ్యాగ్రౌండ్ సంపాదించుకున్న వారిలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆయన నటవారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్న నాగార్జున.. వయసు పెరిగిన ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తన ఫిట్నెస్ తో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక నాగార్జునకు నట వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కేవలం హీరోలు గానే మాత్రమే కాదు.. నిర్మాతలు గాను ఈ అక్కినేని హీరోలు రాణిస్తున్నారు. అయితే అక్కినేని కుటుంబంలోనే ఈ ముగ్గురు తండ్రి కొడుకులు కాకుండా.. సుశాంత్, సుమంత్ కూడా అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరు సినిమాల్లో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. కాగా నాగచైతన్య, అఖిల్, నాగార్జున మాత్రం హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఈ ముగ్గురు అక్కినేని హీరోలతో హీరోయిన్గా రొమాన్స్ చేసిన ఏకెక స్టార్ హీరోయిన్ ఆమెనంటూ ఓ టాలీవుడ్ స్టార్ బ్యూటీ పేరు నెటింట ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది.
ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బుట్ట బొమ్మ పూజ హెగ్డే. పూజా హెగ్డే ఇప్పటివరకు అక్కినేని హీరోలు ముగ్గురితోను రొమాన్స్ చేసింది. నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఆకట్టుకుంది. ఇక నాగార్జునతో కలిసి ఈ అమ్మడు హీరోయిన్గా నటించుకున్నా.. కొన్ని యాడ్స్ లో ఆయనతో కలిసి సందడి చేసింది. ఇలా అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయిన్గా పూజ హెగ్డే ఘనత సాధించింది. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే.. ఫేడైట్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. వరుస క్లాపులతో ఐరన్ లెగ్‌గా ఇమేజ్ రావడంతో పూజ హెగ్డే మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇక ప్రస్తుతం ఫెడౌట్ దశలో ఉన్న ఈ అమ్మడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకున్న తర్వాత ఆమెను ప్రాజెక్ట్ నుంచి తీసేశారు.