టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్‌తో సంక్రాంతికి రంగంలోకి దిగనున్నాడు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలాజ్ కానున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో నిర్వహిస్తున్నారు మేకర్స్. కాగా ఈసారి చరణ్ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా.. పలు టీవీ షోలోలను సందడి చేస్తున్నాడు.
అలా.. తాజాగా హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్న చరణ్.. తెలుగులో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లోను సందడి చేశాడు. బాలయ్యతో కలిసి సరదాగా చెందేసిన చరణ్‌ను బాలయ్య తన ప్రశ్నలతో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ గురించి చెబుతూ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా క్లింకార గురించి మాట్లాడిన ఆయన.. కళ్ళ వెంట నీరు పెట్టుకున్నాడు. తనతో ఓ గంట అయినా సరదాగా ఆడుకుంటేనే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పిన చరణ్.. చాలా బక్కగా ఉంటుంది, బాగా అల్లరి చేస్తుంది, అన్నం పెట్టాలంటే రెండు గంటలు తిప్పుతుంది అంటూ వివరించాడు.
ఇక తన ఫేస్‌ను ఎప్పుడు మాకు రివీల్ చేస్తావ్ అంటూ బాలయ్య అడిగిన ప్రశ్నకు.. క్లింకార తనను నాన్న అని పిలిచిన వెంటనే తనను అందరికీ చూపించేస్తా అంటూ వెల్లడించాడు. దీంతో మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు క్లింకారా చరణ్‌ను నాన్న అని పిలుస్తుందా అంటూ అరటపడుతున్నారు. ఇక షోలో చరణ్ అమ్మా, నాన్నమ్మ మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు. ఇక వీడియోతో పాటు.. లెటర్ని కూడా చరణ్ కోసం పంపించారు. చరణ్ నానమ్మ, అమ్మ ఏమి అడిగారంటే.. 2025లో ఓ వారసుడు ఇవ్వాలంటూ వివరించారు. దాంతో చరణ్ వాళ్లకు ఎలాంటి సమాధానం చెప్పారు.. ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఆసక్తిగా మారింది. ఇంకా ఈ షో ఈనెల 8న సాయంత్రం ఏడు గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.