మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చేసింది. చరణ్ శంకర్ కాంబోలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్ ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. కియారా అద్వాని హీరోయిన్‌గా.. శ్రీకాంత్, సునీల్, అంజలీ , ఎస్.జే.సూర్య కీలకపాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు రూ.127 కోట్ల బిజినెస్ జరుపుకుందని సమాచారం. ఈ క్రమంలోనే బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.130 కోట్లు షేర్ రావాలి.
ఇక ఓవర్సీస్ లో రూ.200 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందట. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. బాహుబలి, సల్లార్, బాహుబలి 2, కల్కి 2898 ఏడి, ఆర్‌ఆర్ఆర్, పుష్ప 2 సినిమాలు ఈజీగా రూ.450 కోట్లు కలెక్షన్లు దక్కించుకున్నయి. దీంతో గేమ ఛేంజర్ ఈ క్లబ్లో మొదటి వారంలోనే చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.550 కోట్ల కన్నా ఎక్కువ వసూళ్ళు చేస్తే.. అప్పుడే దిల్ రాజు లాభాల బాటలోకి అడుగు పెడతారు. ఇక ఈ సినిమాను దిల్ రాజు రూ.550 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలోనే ఏపీ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ మూవీ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు.. బెనిఫిట్స్ కూడా అనుమతినిచ్చింది. అలాగే ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జనవరి 10వ తెలవారుజామున గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతినిచ్చారు. ప్రీమియర్ షో టికెట్ కాస్ట్ రూ.600 నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌కు రూ.175, సింగిల్ స్క్రీన్ కి రూ. 135 పెంచుకోవచ్చని జనవరి 10 నుంచి 6 షోలను ప్రదర్శించే పర్మిషన్స్ ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా గేమ్ ఛేంజర్ 5 షోలు పడనున్నాయి. జనవరి 23 వరకు టికెట్ పంపుకు అవకాశం ఇచ్చారు. దీంతో పవన్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ సక్సెస్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.