టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక.. శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ విజువల్స్ కేరాఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే సాంగ్స్ లోని పాటలు విశేషంగా ఆకట్టుకునోన్నాయని.. విజువల్స్ కట్టిపడేస్తాయని తెలుస్తుంది. ఇక సినిమాలోని నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారంటూ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. అంతేకాదు.. ఒక్కో సాంగ్‌కు ఒక్కో ప్రత్యేకత ఉందంటూ ఆయన వెల్లడించాడు.
జరగండి.. జరగండి..:
ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ జరగండి.. జరగండి.. సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభుదేవా కొరియోగ్రాఫి చేసిన ఈ సాంగ్ కోసం 600 మంది డ్యాన్సర్లు పనిచేయగా.. 13 రోజుల పాటు షూటింగ్ జరిపారు. 70 అడుగుల ఎత్తున కొండ, విలేజ్ సెట్, దానికి తగిన కాస్ట్యూమ్స్.. ఇలా అన్ని పర్యావరణహితమైన జనపనారతో తయారు చేశారట. ఇదే ఈ సాంగ్ స్పెషాలిటీ. ఇక సాంగ్ విజువల్స్ మూవీలోని అన్ని సాంగ్స్ కంటే అద్భుతంగా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
రా మచ్చా:
ఇక సినిమా సెకండ్ సింగిల్ రా మచ్చా రా సాంగ్ యూత్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ వెయ్యి మంది జానపద కళాకారులు డ్యాన్స్ వేరియేషన్‌లతో ఆకట్టుకున్నారు. రకరకాల ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిన కళాకారులు ఈ సాంగ్‌కు పనిచేశారు. గుస్సాడీ – అదిలాబాద్, ఇచ్చావ్ – పశ్చిమబెంగాల్, గూమ్ర – ఒడిస్సా, మట్టిల్కల – గొరవరా, గుణితా – కర్ణాటక, రణప్ప – ఒడిస్సా, పైక – జార్ఖండ్, హల్కీ.. బొక్కాలిగా – కర్ణాటక, తప్పెటగుళ్ల – విజయనగరం, దురావా – ఒడిస్సా ప్రాంతాల నృత్యాలు ఇందులో కనిపిస్తాయి.
నానా హైరానా:
ఇక శంకర్ సినిమాల్లో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు ఆడియన్స్ కు పరిచయం చేస్తూనే ఉంటాడు. అలా మొదటిసారి ఇన్ఫ్రా కెమెరాతో తీసిన మొట్టమొదటి ఇండియన్ సాంగ్‌గా నానా హైరానా రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ షూట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వైవిధ్యవర్ధమైన సంగీతం అందించగా.. మనీష్ మల్హోత్రా ఈ పాటకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఆరు రోజులపాటు పాట షూట్ జరిగింది.
దోప్ సాంగ్:
అమెరికాలో జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుక సందర్భంగా దోప్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. కోవిడ్ సెకండ్‌వేవ్‌లో ఈ పాటను షూట్ చేయడం విశేషం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ కోసం రష్యకు 100 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను ఫ్లైట్లో తీసుకువచ్చి మరి షూట్ జరిపారట. ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ లో 8 రోజులపాటు ఈ సాంగ్ షూట్ జరిగింది. ఈ పాటకు మనీష్ మల్హోత్ర కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. ప్రస్తుతం మూవీకి సంబంధించిన నాలుగు సాంగులు రిలీజ్ చేయగా.. ఐదో సాంగ్ మరింత స్పెషల్ గా ఉండనుందని సమాచారం. డైరెక్ట్‌గా వెండితెర పై ఆ సాంగ్ చూడాల్సి ఉంది. ఇక సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి సాంగ్ థ్రిల్ చేస్తుందని మూవీ టీం చెబుతున్నారు.