గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ ట్రైలర్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్‌ డైరెక్షన్‌లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ హైప్‌ నెలకొంది. ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. సంక్రాంతి బరిలో మొద‌ట‌ రానున్న గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్‌తో జనవరి 10న ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.

Ram Charan's Game Changer Trailer Launch Postponed; Check New Date And Other Details

ఇప్పటికే సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో సాంగ్‌కు.. ఒక్కో స్పెషలిటీ అంటూ నెటింట‌ సినిమాకు సంబంధించిన ప్రతి సాంగ్‌ వైరల్ గా మారుతుంది. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇక సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో తన నటనతో సత్తా చాటుకోనున్నాడు. ఎస్ఎస్. రాజమౌళి చేతుల మీదుగా తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇందులో చరణ్ లుక్స్, మేనేరిజం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ కట్ చూస్తున్నంతసేపు మ్యూజిక్, ఫైట్లతో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాడు శంకర్. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర శంకర్ తన సత్తా చాటుకొనున్నట్లు అర్థమవుతుంది. గేమ్ ఛేంజ‌ర్‌ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కొండాపూర్ లోని ఏఎంబి మాల్‌లో జరిగింది. ఇక ట్రైలర్ చూసిన చరణ్ అభిమానులతో పాటు.. సాధారణ ప్రేక్షకులు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.