నందమూరి నటసింహ బాలయ్య, బాబి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్కానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉండడం.. దర్శకుడు బాబి గత మూవీ చిరు.. వాల్తేరు వీరయ్య తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో వీరిద్దరి కాంబోలో రూపొందిన ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో టీం ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇందులో భాగంగానే తాజాగా సినిమా నుంచి దబిడి దిబిడే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.థమన్ వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.