సంధ్య థియేటర్ ఘటన తర్వాత.. బన్నీ అరెస్ట్ వ్యవహారం.. తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీ ప్రముఖుల మొత్తం సీఎం రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన తర్వాత హీరోలు హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడానికి కూడా బయపడే పరిస్థితి. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ ఈవెంట్ కోసం థియేటర్స్ కి రావాలన్న భయపడిపోతున్నారు. ఎందుకంటే ఓ స్టార్ హీరో వస్తే కచ్చితంగా జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఏదైనా తొక్కిసులాట జరిగి ప్రాణాలకు ప్రమాదం వస్తే సదరు హీరో లేదా, హీరోయిన్ మానసికంగా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి.
అందుకే సాధ్యమైనంత వరకు హీరోలు వాటికి పూర్తిగా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా రాజమౌళి వచ్చి సందడి చేశాడు. రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఏఎంబి మాల్‌లో ఈ ఈవెంట్ జరిగింది. అయితే.. సాధారణంగా అభిమానులకు ప్రవేశం లేదు. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే ఈ ఈవెంట్ కు పర్మిషన్ ఉంది. అయినప్పటికీ ట్రైలర్ ప్రమోషన్స్ చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఎలాంటి పరిస్థితి నెలకొంటుందనే ఉద్దేశంతోనే చరణ్ ముందే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.
అంతేకాదు మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ కూడా నేడే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా చడి చప్పుడు లేకుండా కానించేశారు. మీడియాకి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమా పూజ సార్మని చేసేసారు. మీడియాకి సమాచారం అందిస్తే ఎక్కడ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటారో అన్న భయంతోనే ఇలా చేసినట్లు సమాచారం. ఇక టాలీవుడ్ టాప్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చరణ్, మహేష్ బాబు తాజాగా తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే.. గతంలో బన్నీ అరెస్ట్ ప్రభావమే ఈ రేంజ్ లో ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక చరణ్ నుంచి రిలీజైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ఇప్పటికే చూసిన ఆడియన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయంటూ.. బిజిఎం అదుర్స్ అంటూ.. చరణ్ డ్యూయల్ రోల్‌లో ఇరగదీశాడంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.