టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్‌కు వెళ్లడం.. అక్కడ తోక్కీసలాట ఘటనలో మహిళా మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన అల్లు అర్జున్.. మరుసటిరోజే మద్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అల్లు అర్జున్ కు బయలు ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ బాగా డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి.. ఇలాంటి క్రమంలో రెగ్యులర్ బెయిల్ ఇస్తే ఆయను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.. అంతేకాదు పోలీసుల విచారణకు సరిగ్గా సహకరించకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇలా పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు పై ఇంకా దర్యాప్తుల కొనసాగుతున్నాయని.. బెయిల్ ఇస్తే విచారణకు కోపరేట్ చేసేలా ఆదేశించాలని కోర్ట్‌కు వినపించారు. ఇక మరో పక్క అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు.. అల్లు అర్జున్‌కు కేసుతో సంబంధం లేదని.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదన వినిపించారు.
ఇరుపక్షల వాదన విన్నకోర్టు తీర్పును ఈరోజుకి వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై అసలైన తీర్పు రానుంది. దీంతో అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా.. లేదా.. పోలీసుల వాదనకు కోర్టులో న్యాయం జరుగుతుందా.. ఏం జరగనుందనే సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. కాగా ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం బన్నీకి బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.