తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీకి మొదటి అడుగు పడింది. మూవీ పూజా కార్యక్రమాలు చడి చప్పుడు లేకుండా ఈ రోజు ఉదయం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తయ్యాయి. తాజాగా SSMB29 లాంచింగ్ శర్మని ఏర్పాటు చేశారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ 17 ఏళ్ళుగా ఫాలో అవుతున్న ఓ లక్కీ సెంటిమెంట్‌ని బ్రేక్ చేశాడని న్యూస్ వైరల్‌గా మారింది. మహేష్‌కి మొదటి నుంచి సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే.. తన మూవీ టైటిల్స్ విషయం ఆయన ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడట. మొదట మహేష్ మురారితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే దాదాపు మహేష్ అన్ని సినిమాలకు మూడు అక్షరాలు టైటిల్ వచ్చేలా సెంటిమెంట్ ఫాలో అవుతాడు. అలా ఒక్కడు సినిమా నుంచి ఆగడు సినిమా వరకు మహేష్ నటించిన దాదాపు అన్ని సినిమాలు మూడు టైటిల్స్‌తోనే రిలీజ్ అయ్యాయి.
వాటిలో ఒకడు, పోకిరి, దూకుడు ఇండస్ట్రియల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మహేష్ పెట్టుకున్న మరో క్రేజీ సెంటిమెంట్ తన కొత్త సినిమా పూజ కార్యక్రమాల్లో ఆయన అటెండ్ కాకపోవడం. ఆయనకు బదులు తన భార్య నమృత శిరోద్కర్‌తో పాటు.. కుటుంబ సభ్యులు ఈవెంట్‌లో పాల్గొంటారు. అలా ఇప్పటివరకు మహేష్ బాబు తన సినిమా పూజ శర్మానిలకు హాజరు కాకూడదని సెంటిమెంట్ను ఫాలో అయ్యారు. ఇక కారణం ఏదైనా ఇటీవల SSMB29 లాంచ్ ఈవెంట్లో ఈ సెంటిమెంట్ ను మహేష్ బ్రేక్ చేశాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో మహేష్ బాబు సందడి చేశాడట. మహేష్ బాబు పూజ శర్మనీ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద.. మహేష్ గారు వెళుతున్న వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారుతుంది.
అయితే జక్కన్న ఒత్తిడి కారణంగానే మహేష్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సి వచ్చిందని.. పూజా కార్యక్రమానికి వచ్చాడంటూ టాక్ నడుస్తుంది. దాదాపు 17 సంవత్సరాలుగా తన ఏ సినిమా ప్రమోషన్లకు వెళ్ళని మహేష్.. SSMB29 కోసం ఆ సెంటిమెంట్ వదులుకున్నాడట. అంతేకాదు.. మహేష్ కుటుంబ సభ్యులు కూడా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారట. ఇక త్వరలోనే సినిమా షూట్ కూడా ప్రారంభం కానుంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సీట్లో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానందుని తెలుస్తుంది. ఇక సినిమాలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో జంగిల్ అడ్వెంచర్స్ డ్రామాగా హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించినట్లు సమాచారం. కాగా జక్కన్న సినిమాలో ప్రారంభిస్తున్నారు అంటే.. ఆ సినిమాకు సంబంధించిన విషయాలను మొదటి ప్రెస్ మీట్ పెట్టి అభిమానులతో షేర్ చేసుకుంటాడు. అలా SSMB29 సినిమా ప్రారంభానికి రాజమౌళి ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.