సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు సెట్స్ పైకి రానుంది. జనవరి 2 అంటే నేడు.. ఈ సినిమా లాంచ్ జరుగుతుందని సమాచారం. అయితే.. సినిమా లాంచ్ విషయంలో జక్కన్న హంగామా చేయకుండా.. చాలా సైలెంట్‌గా కానిచ్చేస్తారని.. సినిమా లాంచ్ కు మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేవంటూ తెలుస్తుంది. సెంటిమెంట్ ప్రకారం.. మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి వెళ్ళడు. ఈ క్రమంలోనే ప్రతి సినిమాకు జక్కన్న మీడియా సమావేశం నిర్వహించి.. సినిమా విశేషాలను షేర్ చేసుకుంటారు. బహుశా.. మహేష్ ఈ ప్రెస్‌మీట్‌లో సందడి చేసే ఛాన్స్ ఉంది. అయితే.. ప్రెస్ మీట్ ఎప్పుడు అనేదానిపై క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఆఫ్రికన్ రచహయిత విల్ బర్గ్ స్మిత్ రాసిన నవల ఆధారంగా.. జక్కన్న ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమాని రూపొందించనున్నాడు. తనకు కావలసిన విధంగా తండ్రి విజయేంద్రప్రసాద్తో జక్కన్న కథ డిజైన్ చేయించాడు. 1000 కోట్ల బడ్జెట్.. రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. కేఎల్ నారాయణ.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పూ ఈ సినిమా రూపొందనుంది. సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్‌చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ను కూడా హయ్యర్ చేసుకుంటున్న జక్కన్న.. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడట. డిస్నీ లాంటి సంస్థలు తమ సినిమాకి వరల్డ్ వైడ్ గా మార్కెటింగ్ ఎలా చేస్తాయో తెలిసిందే. అలాంటి సంస్థలని ఈ సినిమాకు భాగస్వాములుగా చేస్తే హాలీవుడ్ లో కూడా సినిమాపై హైప్ పెరుగుతుందని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అందుకే డిస్నీ, సోనీ లాంటి సంస్థల భాగస్వామ్యం సినిమాకు ఉండొచ్చని చెప్తున్నారు. ఇక.. సినిమాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే మహేష్, రాజమౌళి అన్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ సినిమా కోసం వీళ్ళిద్దరు స్ట్రాటజీ మార్చారట. రాజమౌళి, మహేష్ ఇద్దరు తమ ప్రతి సినిమాలో కొంత భాగం షేర్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమాకు మాత్రం వీళ్లు వాటా ఎక్కువగా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. వెయ్యి కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం మహేష్ 40% వాటా తీసుకోనున్నారట. ఇద్దరు రెమ్యూనరేషన్ బాగా తగ్గించుకొని వాటా ఎక్కువగా తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమా లాంచ్ తర్వాత ఎలాంటి విషయాలు రివీల్ అవుతాయో వేచి చూడాలి.