టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను కొద్దిరోజుల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి వేడుక గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, పెళ్లి విశేషాలను అభిమానులతో పంచుకుంది. 12వ తరగతి చదువుతున్నప్పుడే ఆంటోనీతో తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది. 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని చెప్పిన కీర్తి.. నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలా ఉందంటూ వెల్లడించింది. హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలని. మా వివాహం కోసం మేమిద్దరం ఎన్నో కలలు కన్నాం. నేను 12వ తరగతి ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం.
నాకంటే అంటోని ఏడేళ్లు పెద్ద. ఆరేళ్ల నుంచి కత్తర్ లో వర్క్ చేస్తున్నాడు.. కెరీర్‌కు సపోర్ట్ ఇస్తాడు. ఆంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అంటూ కీర్తి సురేష్ వెల్లడించింది. ఇక మొదట ప్రపోజ్ చేసిన సమయం గురించి వివరిస్తూ అంటోనీతో ఉన్న పరిచయంతో నెలరోజులు సరదాగా గడిపానని.. తర్వాత నేను మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళా.. ఆంటోనీ అక్కడికి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉండడంతో కలిసే అవకాశం రాలేదు. కనుసైగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయ్యి అన్నా.. అలా 2010లో అంటోని నాకు ప్రపోజ్ చేశారు.
2016 నుంచి మా బంధం మరింత బలపడింది. ఓ ప్రామిస్ రింగు గిఫ్ట్ గా ఇచ్చారు. మేము పెళ్లి చేసుకునే వరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగ్ చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. మా పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు ఇది ప్రైవేట్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాం. అంటోనీతో ప్రేమలో ఉన్నట్లు కేవలం అతి తక్కువ మంది స్నేహితులు, ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే తెలుసు. సమంత, విజయ్, అట్లీ, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మి ఇలా కొద్దిమందికి మాత్రమే మా ప్రేమ వ్యవహారం తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.
వ్యక్తిగత విషయాలను సీక్రెట్‌గా ఉంచడానికి ఇద్దరం ఇష్టపడతామని.. అంటోనీకి సిగ్గు ఎక్కువ. అందుకే ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు.. చేతులు పట్టుకొని నడవడం లాంటివి చేయలేదు.. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. 2017 లో మొదటిసారి ఇద్దరం జంటగా విదేశానికి వెళ్దాం.. రెండేళ్ల క్రితమే సోలో ట్రిక్ వెళ్ళాం.. 2022 నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నం.. ఫైనల్ గా 2024 డిసెంబర్లో వివాహ బంధంతో కలిసామంటూ కీర్తి వివరించింది. ఇక పెళ్లయిన తర్వాత నుంచి నేను పసుపు తాడు తీయలేదని.. సినిమా ప్రచారాల్లోనూ కూడా ఇతానే కనిపిస్తున్నానని.. ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది, మంచి సమయం చూసి మంగళసూత్రాలు.. బంగారు గొలుసులోకి మార్చుకుంటా అంటూ చెప్పుకొచ్చింది.