‘ గేమ్ ఛేంజ‌ర్‌ ‘ లో సెన్సార్ క‌ట్ చేసిన ప‌దాలు.. సీన్లు ఇవే.. మొత్తం ర‌న్ టైం లెక్క ఇదే..!

సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్న సినిమాల్లో గేమ్ ఛేంజ‌ర్‌ మొదటి వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి 2024 డిసెంబర్లో రావాల్సింది. కానీ.. సంక్రాంతికి మెగాస్టార్ చిరు త‌న‌ విశ్వంభర కు అనుకున్నడేట్‌ని గేమ్ ఛేంజ‌ర్‌కు త్యాగం చేయడంతో.. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. కాగా ఈ సినిమా సెన్సార్ నేపథ్యంలో సభ్యులకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి.. నడివి ఎంత.. సెన్సార్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమై.. ఉంటుంది అనే వివరాలు ఒకసారి చూద్దాం.

మొదట సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే 125 నిమిషాల 30 సెకండ్లు అంటే.. 2 గంటలు 45 నిమిషాల 30 సెకండ్లు న‌డివితో రానుంది. కాగా ఇటీవ‌ల‌ భారీ బడ్జెట్ సినిమాల్ని 3 గంటల కంటే ఎక్కువ న‌డివితో రిలీజ్ చేస్తుండగా.. గేమ్ ఛేంజ‌ర్‌ను 2 గంటల 45 నిమిషాలకే ముగించడం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 3గంటల కంటే ఎక్కువ న‌డివితో వచ్చిన సినిమాలకు రిలీజ్ తర్వాత మళ్లీ కొంతమేర అంటే.. కొన్ని నిమిషాల సీన్లు కట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ సినిమాకు అలాంటి ఇబ్బంది లేకుండా మేకర్స్ ముందుగానే మంచి నిర్ణయం తీసుకున్నారు.

ఇక సినిమా సెన్సార్ విషయానికి వస్తే.. క‌ట్స్‌ ఏమీ లేవ‌ని.. కొన్ని కొన్ని వర్డ్స్ ని రీప్లేస్ చేయాలని.. సెన్సార్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక వారు పెట్టిన కండిషన్స్.. టైటిల్ కార్డు తెలుగులో ప్రదర్శించాలి, మధ్యనికి సంబంధించిన లేబుల్స్ తీసేయాలి.. అయితే దీనిని సిజితో కవర్ చేశారు. సినిమాలో ఎక్కువసార్లుగా వినిపించిన చట్ట ప్రకారం అనేవాడు తొలగించాలని.. అలాగే కేరళ అనే పదాన్ని అందుకు సంబంధించిన సబ్ టైటిల్ ని తీసేసి సినిమాలు ప్రదర్శించాలని సెన్సార్ ఆదేశించారట.

Game Changer release date: Ram Charan, Shankar's film to hit the theatres on THIS day

ఇక చట్టప్రకారం అనే వర్డ్ ప్లేస్ లో లెక్క ప్రకారం అనే వర్డ్‌, కేరళ అనే పదాన్ని పూర్తిగా తొలగించినట్లు తెలుస్తుంది. ఇక దుర్గాశక్తి నాగపాల్ అనే పేపర్ కటింగ్ తొలగించమని సెన్సార్ చెప్పగా.. ఆ ప్లేస్‌ను సుచిత్ర పాండేతో రీప్లైస్‌ చేసారు. అంతేకాదు.. టైటిల్ కార్డ్‌లో పద్మశ్రీ బ్రహ్మానందం అని వేయగా.. పద్మశ్రీని తొలగించాలని ఆదేశించడంతో పద్మశ్రీ తొలగించారు. అలా యాడింగ్ రీప్లేస్మెంట్ తప్ప.. మిగతావన్నీ బాగానే ఉన్నాయని.. సెన్సార్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని తెలుస్తుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో జనవరి 10న సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది.