టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తిరుగులేని స్టార్ హీరోగా మహేష్ బాబు మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు నటించి ఆకట్టుకున్నాడు. అయితే తన కెరీర్‌లో కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా.. మహేష్ బాబు ఓ సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన తర్వాత.. ఆ డైరెక్టర్లను గుడ్డిగా నమ్మి రెండో అవకాశం ఇస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఆయనకు భారీ డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులు చాలామంది ఉన్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో.. ఆ లిస్ట్ ఏంటో.. ఒకసారి చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీనువైట్ల డైరెక్షన్‌లో మొదట దూకుడు సినిమా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో.. మహేష్ బాబు.. శ్రీను వైట్లకు రెండో అవకాశం ఇచ్చాడు. ఇందులో భాగంగానే మహేష్ తో ఆగడు సినిమా తెరకెక్కిచాడు శ్రీను వైట్ల. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది.
ఇక టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైన శ్రీకాంత్ అడ్డాల.. మొదట మహేష్ బాబు, వెంకటేష్ హీరోగా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీస్టారర్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు.. ఈయనకు మరో అవకాశాన్ని ఇచ్చాడు. అలా మహేష్ తో.. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమాలో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాతో శ్రీకాంత్.. మహేష్ కు ఘోర డిజాస్టర్ ఇచ్చి ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాడు.
ఇక మహేష్ బాబు, డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్లో గతంలో ఒక్కడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. దానితో మహేష్.. గుణశేఖర్ తో అర్జున్ సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించింది. ఈ క్రమంలోనే మరోసారి గుణశేఖర్‌ను నమ్మి అవకాశం ఇస్తే ఈసారి సైనికుడు సినిమా తెరకెక్కించి తనకు ఫ్లాప్ ని ఇచ్చాడు గుణశేఖర్. ఇలా మహేష్ కొంతమంది దర్శకులకు నమ్మి రెండో అవకాశం ఇస్తే.. చాలామంది వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక ఫెయిల్ అయ్యారు.