టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లలో ఒకరైన సుకుమార్ ఇటీవల పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకున్ని ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా ఇలాంటి క్రమంలో సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తన సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక సుక్కు కూతురు ప్రధాన పాత్రలో నటించిన మూవీనే.. గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పద్మావతి మల్లాది డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు పుష్ప 2 బ్యానర్.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ భార్య శ్రీమతి తబిత సుకుమార్.. సమర్పకురాలిగా వ్యవహరించింది. నవీన్ యార్నేని, యాలమంచలి శంకర్, శేష సింధురావు నిర్మాతలుగా ఉన్నారు. కాగా ఈ సినిమా రిలీజ్‌కి ముందే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అలా ఈ సినిమాలో సుకృతి వేణి నటనకు గాను.. ఉత్తమ బాలునట్టుగాను అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పద్మావతి మల్లాది మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా నెగటివ్ వైబ్రేషన్స్.. ద్వేషాలు, అసూయ లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని.. సోషల్ మీడియాలోను ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు, ఎన్నో ఘర్షణలు కనిపిస్తూనే ఉన్నాయని వివరించింది.
సాధారణంగా అహింస అనగానే మనకు జాతిపిత మహాత్మా గాంధీ గుర్తొస్తారు. ఇలాంటి క్రమంలోనే గాంధీ గారి సిద్ధాంతాలను అభిమానిస్తూ ఆయన బాటను అనుసరించే ఓ 13 ఏళ్ల పాప.. తన పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనే అంశాన్ని ఆశక్తికరంగా చూపించమంటూ వెల్లడించింది. ఇక ఈ సినిమా ప్రతి తల్లిదండ్రులు.. తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా అని.. తప్పకుండా అందరూ హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు సినిమాలో చూస్తారంటూ.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారని.. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అంటూ వెల్లడించింది. అంతేకాదు.. ఈనెల 24న సినిమా రిలీజ్ కానున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో రిలీజ్ కు ముందే సుకుమార్ కూతురు తండ్రికి మించిన తనయురాలిగా నేషనల్ రేంజ్ లో అవార్డు దక్కించుకొని సత్తా చాటింది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.