బన్నీ 2027 దాకా మళ్ళీ జనానికి కనపడడం కష్టమేనా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా రూ.1700 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే టాప్ సినిమాగా నిలిచిన బాహుబలి, ఆర్ఆర్ రికార్డ్‌ల‌ను పటాపంచలు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడు. త్రివిక్రమ్ ఎప్పటికి ఈ సినిమా స్క్రిప్ పనులను పూర్తిచేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గ‌డుపుతున్నాడు.

Pushpa: The Rule - Part 2 (2024) - IMDb

ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో త్రివిక్రమ్ అడుగు పెట్టనున్నాడు. ప్రయోగాత్మక పీరియడ్ డ్రామా జోన‌ర్‌ ఫాంటసీ మూవీగా త్రివిక్రమ్ సినిమాను రూపొందించినున‌న్నాట‌. ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంద‌ని.. స్వ‌తంత్రానికి ముందు జ‌రిగిన కొన్ని అంశాలను హ్యూమన్ టచ్ తో హైలెట్ చేస్తూనే.. మైథాలాజికల్ ట‌చ్‌తో సినిమాలో రూపొందించనున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా షూట్ ప్రారంభించి పూర్తి అవడానికి దాదాపు 15 నెలల వరకు టైం పడుతుందని టీం భావిస్తున్నారటన‌ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉంది.

An exciting update about Trivikram-Allu Arjun's combo - Andhrawatch.com

దీనికి తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు విషయంలో కూడా ఎక్కువ సమయం తీసుకోవాలి. వీటన్నింటి బట్టి చూస్తే ఈ సినిమా 2027 స్టార్టింగ్ వరకు రిలీజ్ కావడం కష్టమే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మళ్లీ వెండి తెరపై 2027 క‌నిసించ‌డం క‌ష్ట‌మే అంటూ టాక్ నడుస్తుంది. కాగా ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనే, పూజా హెగ్డే నటించనున్నారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే బన్నీ, పూజా హెగ్డే కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే చాలా అద్భుతంగా ఉంటుందంటూ బన్నీ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా షూట్ త్వరలోనే ప్రారంభించనున్నారట.