అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల డిసెంబర్ 5న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు సీక్రెట్ డేటింగ్ చేసిన ఈ జంట.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం చేసుకున్నారు. సమంతతో విడాకులు అనంతరం చైతు, శోభిత అతి తక్కువ టైంలోనే ఒకరితో ఒకరు స్నేహం చేయడం.. అది కాస్త ప్రేమగా మారడంతో చాలాకాలం చట్టపట్టలేసుకుని తిరిగిన ఈ జంట.. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక పెళ్ళికి ముందు వీరు కలిసి కనిపించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
కాగా ప్రస్తుతం నాగచైతన్య తండేల్ షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూట్ పూర్తైన వెంటనే హనీమూన్ ప్లాన్ చేస్తున్నారట. విదేశాల్లో హనీమూన్ జరుపుకోవాలని భావిస్తున్నారట. శోభిత కూడా ప్రస్తుతం తన షూటింగ్లలో సందడి చేస్తుంది. వివాహం జరిగినప్పటికీ ఎప్పటిలాగే శోభిత తన పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. ఇదివరకే ఒప్పుకున్న ప్రాజెక్టులను ప్రస్తుతం నటిస్తూ బిజీగా గడుతుంది. అయితే ఈ సినిమాలన్నీ పూర్తైన వెంటనే సినిమాలు మానేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.
ఇక చైతు మొదటి నుంచి ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. జిమ్ చేయడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడం.. అలాగే ఫుడ్ స్పెషల్ డైట్ ఫాలో అవుతూ ఉంటాడు. అయితే వివాహం అయిన తర్వాత శోభిత కారణంగా ఆ డైట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్నాడట. శోభిత ఫుడ్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టిందని.. ఫుడ్ చాలా వరకు తగ్గించాలని వెల్లడించినట్లు టాక్ నడుస్తుంది. గతంలో కూడా చైతూ తన మొదటి భార్య హీరోయిన్ సమంత మాట వినేవాడట. ఆమె చెప్పినట్టుగానే ఫుడ్ డైట్ ఫాలో అయ్యాడట. ఆరోగ్యం కాపాడుకునేందుకు సమంత ఎన్నో టిప్స్ ఇచ్చేదాన్ని.. ఇప్పుడు శోభిత కూడా అలానే చేస్తుందని తెలుస్తుంది.