టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన కొడుకుల్లో ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. వారిలో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అల్లు అర్జున్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు తెలిసిందే. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ రికార్డులను బ్రేక్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తున్న ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క సరైన మిట్ కూడా రాలేదు. దీంతో.. అల్లు శిరీష్ కొద్దికాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి తర్వాత.. మళ్ళీ ఊర్వసివో రాక్షసివో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. అయినా సరైన రిజల్ట్ అందుకోలేకపోయాడు.
దీంతో.. సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న శిరీష్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌లు రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శిరీష్ తాజాగా కమెడియన్ అలీ హోష్ట్‌గా వ్యవహరించిన ఓషోలో పాల్గొని సందడి చేశాడు. చాలామందికి తెలియని నిజం గురించి ప్రశ్నించాడు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడగగా.. తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ సమాధానం ఇచ్చాడు. అయితే చాలామందికి అల్లు శిరీష్ కు నలుగురు కొడుకులు అన్న సంగతి తెలియదు. మొన్నటివరకు ఇద్దరే అనుకున్న తర్వాత మూడో కొడుకుని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఇప్పుడేమో మళ్ళీ నాలుగో కొడుకు అంటున్నారు. అతను ఎవరు.. ఎక్కడున్నాడు.. అనే సందేహాలు అభిమానులు మొదలయ్యాయి. అయితే అల్లు అరవింద్ కు అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్.. నలుగురు కొడుకులట. తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయస్సులో ప్రమాదంలో మరణించాడని సురేష్ వివరించాడు. ఇక అప్పటికి శిరీష్ పుట్టనే లేదట. అప్పటినుంచి అన్న గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావన రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అరవింద్ కూడా ఈ విషయాన్ని ఎప్పుడు బయట చెప్పుకోలేదు. కాగా.. శిరీష్ మాటలకు అలీ రియాక్ట్ అవుతూ అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని భావించా.. కానీ అలాంటి ఎమోషనల్ క్వొశ్చన్ వేసి ఆయన మూడ్ పాడుచేసే ధైర్యం చేయలేకపోయా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.