సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇప్పటికే చూస్తున్నాం. ఇప్పుడు.. తాజాగా మరో ట్విస్ట్ కేసులో చోటు చేసుకుంది. బెనిఫిట్‌షో రోజు రాత్రి.. జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు విపరీతంగా లాటి చార్జ్ చేశారు. ఈ ఘటన కారణంగా తీవ్ర అలజడి రేగింది. తాజాగా దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కమిషన్ సభ్యులు.. నాలుగు వారాల్లో దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని తెలంగాణ బీజేపి.. జితేందర్‌కు ఆదేశాలు పంపారు. దానికి డిజిపి నుంచి ఎలాంటి రియాక్షన్ రానుందో వేచి చూడాలి. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు బన్నీ తప్పు ఉన్నట్టుగా చూపిస్తూ పదినిమిషాల వీడియో ఫుటేజ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ రోజు పోలీసులు కూడా హద్దులు దాటి అక్కడకు వచ్చిన అభిమానులపై లాఠీచార్జ్ చేయడంతోనే ఇలాంటి వాతావరణాన్ని నెలకొందని లాయర్ రామారావు ఆరోపించాడు. దానికి తగిన ఆధారాలు కమీషన్‌కు అందించగా.. కమిషన్ కూడా తీవ్రస్థాయిలో దీనిపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో.. బన్నీ ఫ్యాన్స్.. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి డిజిపి వెంటనే పోలీసులపై చర్యలు తీసుకుంటాడా.. లేదా వాళ్ళ వెర్షన్‌ని వినిపించే ప్రయత్నం చేస్తాడు.. వేచి చూడాలి.