ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ లు రిజెక్ట్ చేసాడో తెలుసా.. ఆ లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న ఎలాంటి వారైనా.. తమ సినీ కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడం కాయం. వాటిలో కొన్నిసార్లు డిజాస్టర్లు ఉంటాయి. మరి కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు కూడా ఉంటాయి. అల్లా ఎన్టీఆర్ కూడా తన సినీ కెరీర్‌లో ఎన్నో కథలను రిజెక్ట్ చేశాడు. అయితే తన సినీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాల గురించి స్వయంగా తారక్ ఒప్పుకున్నాడు. ఇంతకీ.. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Bommarillu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

కొనేళ్ళ క్రితం సిద్ధార్థ హీరోగా, జెనీలియా హీరోయిన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బొమ్మరిల్లు సినిమాకు ఇప్పటికీ ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఈ సినిమా వస్తుందంటే చాలు.. ఆడియన్స్‌ స్క్రీన్ లకు అతుక్కుపోయి మరి సినిమాను వీక్షిస్తారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. కాగా.. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా తారక్‌ బొమ్మరిల్లు క‌థ‌ను రిజెక్ట్ చేసినట్లు స్వయంగా వెల్లడించాడు.

Prime Video: Bhadra

భాస్కర్ మొదట నాకు బొమ్మరిల్లు కథను వినిపించాడని.. ఆ కథ నాకు బాగా నచ్చిన.. కథలో యాక్షన్ సీన్స్ , భారీ డైలాగ్స్ ఏమీ లేకపోవడంతో సినిమాలో రిజెక్ట్ చేశానని.. కారణం నా సినిమాకు వచ్చే ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాలో భారీ డైలాగ్స్, మాస్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంతో రిజల్ట్ తేడా కొడుతుందని ఉద్దేశంతోనే వదులుకున్నాను అంటూ వివరించాడు. అలాగే.. మాస్ మహారాజు రవితేజ మీరాజాస్మిన్ కాంబోలో భద్ర సినిమాను కూడా తారక్ రిజెక్ట్ చేశాడట. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భద్ర మూవీ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెర‌కెక్కించినదే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తారక్ ఈ సినిమా గురించి వివరిస్తూ కొన్ని కారణాల వల్ల సినిమాను రిజెక్ట్ చేశానని.. తర్వాత సినిమాలో రిజెక్ట్ చేసినందుకు చాలా బాధపడ్డా అంటూ స్వయంగా వెల్లడించాడు. తాను రిజెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి.