సమంత – శోభిత కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. లాస్ట్ మినిట్ లో బ్రేక్..!

స్టార్ హీరోయిన్లు సమంత, శోభిత దూళిపాళ్ల పేర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరి పేర్లు కలిపి చెబితే వీరేదో శత్రువులు అన్నట్టుగా అంతా భావిస్తారు. నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్ళై నెల రోజులు అవుతున్నా.. సమంత, చైతు విడాకులై మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో సమంత, శోభిత కాంబోలో రావలసిన ఓ మల్టీ స్టారర్ మిస్ అయిందనే న్యూస్ వైరల్ అవుతుంది.

Shobhita , MIH : r/BollyBlindsNGossip

ఇక సమంత విడాకుల తర్వాత ఆ ప్లేస్ లోకి శోభిత వచ్చింది. కాబట్టి.. వీరిద్దరి మధ్యన స్ట్రాంగ్ శత్రుత్వం ఉంటుందని అంత భావిస్తారు. కానీ.. నిజానికి వీళ్ళు మొదట మంచి స్నేహితులన్నీ తెలుస్తోంది. సమంత.. నాగచైతన్య లైఫ్ లో ఉన్నప్పుడే శోభిత వీళ్ళిద్దరికీ పరిచయం అయిందట. అంతేకాదు వీళ‌ కాంబినేషన్లో సినిమా సెట్స్‌ పైకి వచ్చి జస్ట్ లో మిస్సయింది. శోభిత సినిమా నుంచి తప్పుకుంది. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు చైతూ, సమంత కాంబోలో వచ్చిన మజిలీ. ఈ సినిమాలో సమంత, నాగచైతన్యను ఎంతగానో ప్రేమించే.. ఆరాధించే పాత్రలో ఆకట్టుకుంది.

Samantha Akkineni, Naga Chaitanya on what sets Majili apart and working  together after marriage – Firstpost

అయితే.. ఎమోషనల్ జర్నీగా సాగే ఈ సినిమాలో నాగచైతన్య ముందు వేరే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ పాత్రలో దివ్యాంక కౌశిక్ ఆకట్టుకుంది. అయితే.. మొదట ఈ పాత్ర కోసం శోభితనే తీసుకున్నారట. కొంతకాలం షూట్ కూడా పూర్తి చేసిన తర్వాత.. ఏవో కారణాలతో శోభిత ఈ సినిమాను వదులుకొంది. దీంతో.. ఈ పాత్ర కోసం దివ్యాంశను తీసుకొని నటింపజేశారు. ఇక సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే.. అలా మజిలీ సినిమా టైంకి రీల్‌ లైఫ్ లో ఉన్న ఇద్దరు.. ప్రస్తుతం రియల్ లైఫ్ లోను ఉన్నట్లు అయిపోయింది. ఇక మజిలి సినిమాలో ఇద్దరు కలిసి నటించినా.. కాంబినేషన్ మూవీ మాత్రం మిస్సయింది.