అన్‌స్టాపబుల్ 4 లో చరణ్ వేసుకున్న ఈ సింపుల్ హుడి కాస్ట్ తెలిస్తే షాకే..!

పాన్ ఇండియ‌న్‌ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ పలకరించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక చరణ్ నుంచి దాదాపు 3 ఏళ్ల తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాపై మరింత ఆశ‌క్తిని పెంచేందుకు మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇక గేమ్ ఛేంజ‌ర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ రామ్‌చరణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేశాడు.

అన్ స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఎంతో తెలుసా... దిమ్మతిరిగి  పోవాల్సిందే

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోస్, ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. కాగ‌ ఈ కార్యక్రమంలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ షోలో చరణ్ బోన్స్ హుడి ధరించి ఆకట్టుకునాడు. దీంతో చరణ్‌ ధరించిన టీషర్ట్ ఎంతో తెలుసుకోవాలని అరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్స్. ఈ లాంగ్ స్లీవ్జ్‌ టీషర్ట్ ఆమీర్‌ బ్రాండ్ కు చెందినది.

అన్ స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఎంతో తెలుసా... దిమ్మతిరిగి  పోవాల్సిందే

అయితే.. ప్రస్తుతం దీని కాస్ట్ తెలిసి నోరెళ్ళ బెడుతున్నారు. ఏకంగా రూ.1,35,722 అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏంటి ఆ సింపుల్ టీషర్ట్ ఏకంగా అంత కాస్ట్ పడుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే సెలబ్రిటీలుగా మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని.. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఇలాంటి కాస్ట్‌లీ బ్రాండెడ్ బట్టలను, యాక్సెసరీస్లను వాడటం చాలా కామన్. ఈ క్రమంలోనే చరణ్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.