మాజీ భార్య ప్రియుడితో స్టార్ హీరో పార్టీ..!

ప్రస్తుత హాలిడే సీజ‌న్ నడుస్తున్న క్రమంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంత సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నారు. పార్టీలతో చిల్ అవుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. వార్ 2 షెడ్యూల్ తో ఏడాదంతా బిజీబిజీగా గడిపిన హృతిక్ రోషన్ కూడా ఎట్టకేలకు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ పార్టీలో స్పెషాలిటీ ఉంది. ఈ వెకేష‌న్‌లో హృతిక్ మాజీ భార్య.. తన ప్రియుడితో పాటు పాల్గొని సందడి చేస్తుంది. అంతేకాదు.. ఈ పార్టీలో న‌ర్గీస్ పక్కి మాజీ ప్రియుడు, ప్రస్తుత ప్రియుడు కూడా ఫుల్ గా ఫీల్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వెకేషన్ కు సంబంధించిన ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఇందులో ఆసక్తిని పెంచుతున్న మ‌రో విషయం ఏంటంటే.. హృతిక్ రోషన్ తో పాటు సూస్సాన్‌ ఖాన్, అర్లసాన్ గోనీతో పాటు ఇతర సెలబ్రిటీ జంటలు కూడా చిల్ అవుతూ కనిపించాయి. దీంతో.. ఈ ఫొటోస్‌ను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది. ఇక ఈ పార్టీలో.. హృతిక్ కొడుకు హృదవ్ ఖాన్‌ కూడా కనిపించాడు. హృతిక్ మాజీ భార్య సుస్సాన్‌ ఖాన్.. ఆమె ప్రియుడు అర్లసాన్ గోనీ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. న‌ర్గీస్ పక్రి ప్రస్తుత ప్రియుడు టోని బీగ్ కూడా ఈ పార్టీలో ఉండడం మరింత ఆసక్తి రేపుతుంది.

అయితే ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే.. ఇదే పార్టీలో చిల్ అవుతున్న ఉద‌య్ చోప్రా – న‌ర్గీస్‌ బ్రేకప్ కి ముందు దాదాపు 5 ఏళ్ళు ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారు. తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోస్ లో న‌ర్గీస్‌.. తన మాజీతో కనిపించినా.. వీళ్ళతో పాటే సుసాన్, నర్గీస్, టోని అర్లసాన్ గోనీ కూడా ఈ ఫోటోలో కనిపించారు. సుస్సాన్‌ సోదరుడు జూయాద్ ఖాన్ కూడా తన భార్య మలైకా ఖాన్ తో కలిసి వెకేషన్ లో సందడి చేశాడు. బాలీవుడ్ స్టార్ కపుల్ షారుక్ ఖాన్, గౌరీ ఖాన్‌తో స‌హా ఎంతోమంది సెలబ్రెటీస్ ఇలా విదేశాల్లో వెకేషన్ లు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్నాయి.