టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వెంట వెంటనే వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిన ఈ అమ్మడు.. నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించి హిట్ అయినా.. ఆ క్రెడిట్ అంత మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో బన్నీ సరసన స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ పైనే చాలా హోప్స్ పెట్టుకున్న శ్రీ లీల.. ఆ సాంగ్ ఒప్పుకోవడం వెనుక చాలా స్పెషల్ సర్ప్రైజ్ ఉందంటూ వెల్లడించింది.
లేదంటే.. స్పెషల్ సాంగ్‌లో నేను నటించే దాన్ని కాదని.. చెప్పుకొచ్చింది. ఇక వీళ్ళతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను అమ్మడు అవకాశాన్ని కొట్టేసింది. పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు చాలా సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలోనే రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ధమాకా సినిమా వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక మాస్ జాతర సినిమాకు భాను భోగవరపు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.
కాగా మాస్ మహారాజ్ ప్రస్తుతం ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇటు రవితేజ, అటు శ్రీలీల ఇద్దరికీ సినిమా హిట్ కొట్టడం చాలా అవసరం. ఇక ధమకతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీలీల.. తర్వాత భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాల్లో నటించి సక్సెస్ అందుకున్నా.. వాటితో అమ్మడికి ఊహించిన రేంజ్ లో ఇమేజ్ క్రియేట్ కాలేదు. దీంతో మాస్ జాతర సినిమాతో ఎలాగైనా మరోసారి తన సత్తా చాటుకుని అవకాశాలు అందుకోవాలని కసితో ఉంది శ్రీలీల. మాస్ జాతర సినిమా ఆమె ఆశించిన సక్సెస్ అందిస్తుందా లేదా.. మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందా.. శ్రీలీల ఈ సినిమాతో సక్సెస్ కొట్టి గట్టెక్కుతుందా.. లేదా.. అనే సందేహాలు అభిమానులు మొదలయ్యాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం.. శ్రీ లీల మరోసారి ఫామ్ లోకి వస్తుందనటంలో సందేహం లేదు.