చిరంజీవి నటవారసుడుగా రామ్‌చరణ్.. చిరుత సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా అంటే కచ్చితంగా ఆలీకి ఏదో ఒక పాత్ర ఉంటుందని అంత భావిస్తారు. ఇలాంటి క్రమంలోనే చరణ్‌ను సినిమాకు ఒప్పించి.. స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వెళుతున్న టైం లో పూరీకి ఎదురైన అనుభవాలతోనే ఆలీ కోసం ఓ పాత్ర సిద్ధం చేశానంటూ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పూరీ.
ఆయన మాట్లాడుతూ.. స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్‌కు వెళ్తుంటే.. అక్కడ పాస్పోర్ట్ చెక్కింగ్ వద్ద సర్ కొత్త సినిమాలో అలీ పాత్ర ఏంటి.. అని ఒక సెక్యూరిటీ సిబ్బంది అడిగాడని.. అది అయిపోయిన కొంతసేపటికి ఫ్లైట్ ఎక్కే టైం లో సర్ ఈ మూవీలో అలీ ఏ పాత్రలో నటిస్తున్నాడని మరో వ్యక్తి అడిగాడంటూ వెల్లడించాడు. దాంతో ఆలోచనలు పడ్డానని.. వెంటనే అశ్విని దత్‌కు ఫోన్‌చేసి.. అలీ గారి కోసం ఓ రోల్ రాస్తున్నా.. అర్జెంట్గా ఆలీ గారి డేట్ లు కూడా తీసుకోండి అని చెప్పేసానని వెల్డించాడు.
ఆయనకు క్యారెక్టర్ ఇవ్వకపోతే జనాలు ఊరుకునేలా లేరు సార్ అని అనడంతో ఆయన కూడా డేట్స్ బుక్ చేశారంటూ చెప్పుకొచ్చాడు. బ్యాంకాక్ వెళ్లిన తర్వాత అక్కడ చూసిన మనుషులను బట్టి నచ్చిమి రోల్ రాసుకున్నానంటూ వెల్లడించాడు. అది ఎలాంటి సూపర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో అలీపాత్ర, వేషధారణ అన్ని ప్రేక్షకులలో నవ్వులు పోయించాయి. ఆయన చేసిన క్యారెక్టర్‌లో భిన్నమైన పాత్రగా నచ్చిమి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనపడితే ఆడియన్స్ కడుపుబ్బ నవ్వుకుంటారు.