ఈ ఏడాది సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వీటితో పాటే విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే నార్త్ అమెరికాలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసేసారు. ఇక ఈ రెండు సినిమాల టికెట్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో ఎలా ఉన్నాయి.. బిజినెస్ ఏ రేంజ్‌లో జరుగుతుందో చూద్దాం.
గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో అన్ని సినిమాలు కంటే ముందు రిలీజ్ అవుతుంది. జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక మూవీకి సంబంధించిన నార్త్ అమెరికన్ టికెట్ బుకింగ్స్ గత కొద్ది రోజుల క్రితమే ఓపెన్ కాగా.. ఈ సినిమాకు ఫ్రీ బుకింగ్స్ 395 లోకేషన్లలో.. 1130 కి పైగా షోలలో ఈ సినిమా ప్రదర్శించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఎప్పటికే ఈ సినిమాకు ప్రీ బుకింగ్స్‌తో 380కే డాలర్ కలెక్షన్లు వచ్చేసాయని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలకు వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే తక్కువ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇంకా సినిమా రిలీజ్ కు వారం రోజులు మిగిలి ఉండడంతో ముందు ముందు సినిమా టికెట్ బుకింగ్స్ మరింత పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక బాలయ్య.. డాకు మహారాజ్ మూవీ 125 పైగా లొకేషన్ లో 340 కి పైగా షోలకు గాను.. ఎప్పటి వరకు కేవలం 92 కే డాలర్ మార్క్‌ను క్రాస్ చేసిందట. మరి ఈ సినిమా రిలీజ్ కు దాదాపు పది రోజులు ఉండడంతో.. ఈ సినిమా పది రోజుల్లో నార్త్ అమెరికాలో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో.. కలెక్షన్ల విషయంలో మరింత పుంజుకుంటుందో.. లేదో.. వేచి చూడాలి. అయితే ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే ఫ్యూచర్‌లోను ఇదే రేంజ్‌లో కలెక్షన్లు ఉంటే.. సినిమా గట్టెక్కడం కష్టమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.