టాలీవుడ్ సీనియర్ సార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడది సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్‌తో పాటు.. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మీనాక్షి చౌదరి.. బాలయ్య గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో ఆమె సందడి చేసింది. ఇందులో బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి మీనాక్షిని షేర్ చేసుకోమనగా.. ఆమె మాట్లాడుతూ బాలయ్య గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తనకు బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఆయన ఎప్పటికీ జై బాలయ్య.. ఫుల్ ఎనర్జిటిక్ పర్సన్, చిన్నపిల్లడి మనస్తత్వం, ఆయన చాలా యాక్టివ్గా, ఎనర్జిటిక్ గా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక బాలయ్య అంటే తనకు ఎంతో గౌరవమని వెల్లడించిన మీనాక్షి దానికి కారణం ఆయన మనుషులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటూ చెప్పుకొచ్చింది.
ఎప్పుడో ఒక షోలో నేను ఆయనను కలిసి మా పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నా. వాటిని షో వరకే వదిలేయలేదు. తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. అన్‌స్టాపబుల్ సెట్‌లో నేను ఆయన కూతుర్లను కూడా కలిసా అంటూ మీనాక్షి చౌదరి వెల్లడించింది. ఇక బాలయ్య.. ఓ అద్భుతమైన వ్యక్తి, ఆయన ఓ రియల్ ఓజి.. ఆయనలా ఇంకెవరూ ఉండలేరు, ఉండరు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి.. బాలయ్య గురించి చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.