గేమ్ ఛేంజర్: శంకర్ రెమ్యునరేషన్ లో కోత వేయించిన దిల్ రాజు.. కారణం అదేనా..?

తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్‌కు తెలుగులోను ప్రత్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెర‌కెక్కిస్తూ సత్తా చాటుతున్న శంకర్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారాడు. మొదట పాన్ ఇండియన్ సినిమాను తెర‌కెక్కించిన డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించి ముందుకు సాగుతున్న క్ర‌మంలో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. మెల్లమెల్లగా అయిన సక్సెస్ రేట్ తగ్గుతూ వస్తుంది. గత పది సంవత్సరాలుగా సక్సెస్ రేస్‌లో శంకర్ వెనుక పడిపోతున్న.. ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. దీంతో.. తాజాగా రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా రూపొందించాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాలని కసితో ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది.

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం శంకర్ రెమ్యునరేషన్లు కూడా భారీగానే డిమాండ్ చేశారట. అయితే.. మొదట్లో దిల్ రాజు ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్‌కు ఒప్పుకున్న తర్వాత సినిమా లేట్ అవుతున్న క్రమంలో.. రెమ్యూనరేషన్‌లో కోత్త విధించినట్లు టాక్ నడుస్తుంది. శంకర్ కూడా దానికి ఓకే చెప్పారని.. మొత్తానికి ఈయనకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని ఒప్పుకున్న దిల్ రాజు.. రూ.65 కోట్లు రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా శంకర్ సినిమా బిజినెస్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని.. ఇలా రెమ్యూనరేషన్ తీసుకునేందుకు ఒప్పుకున్నారట. ఎందుకంటే గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా కమిట్‌ అయిన తర్వాత మధ్యలో భారతీయుడు 2 షూట్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్ వ‌చ్చేసి ఉండేది.

Shankar Proving To Be Too Costly For Dil Raju!

ఆయన వల్లే సినిమా లేట్ అయింది. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ ఆయన కూడా తగ్గించుకున్నట్లు సమాచారం. ఇక.. ఏదేమైనా ఈ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడం అటు దిల్‌రాజుతో పాటు.. చరణ్, శంకర్‌లకు కూడా ఎంతో ముఖ్యం. శంకర్.. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి స్టార్ట్ డైరెక్టర్‌గా తన సత్తా చాటుకోగలుగుతాడు. చరణ్ మార్కెట్ పాన్ ఇండియా లెవెల్ మరింతగా పెరగడానికి సినిమా సక్సెస్ ఎంతగానో అవసరం. సినిమా రిజల్ట్ సరిగ్గా రాకపోతే భారీ నష్టాలు తప్పవనడంలోనూ అతిశయోక్తి లేదు. ఇక గేమ్ ఛేంజ‌ర్‌కు శంకర్ తన మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తాడా.. లేదా భారతీయుడు 2 బాటలో డిజాస్టర్ చేస్తాడా.. తెలియాలంటే మూవీ రిలీజై రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.