సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఖుష్బూకు తెలుగు ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొంతకాలం బ్రేక్ తర్వాత మరోసారి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పటికే చాలాసార్లు తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తెలియజేసింది.
తండ్రి వల్ల కుటుంబంలో ఎన్నో సమస్యలు చూసామని.. తల్లి, సోదరులను చిత్రహింసలు పెట్టాడని.. తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి బయట పెడితే వాళ్ళను మరింత హింసిస్తాడని.. భయంతో చాలాకాలం నేను దీనిపై బయట మాట్లాడలేదని చెప్పుకొచ్చింది ఖుష్బూ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత.. తాను ధైర్యంగా సమాధానం చెప్పడం నేర్చుకున్నానని.. ఆయనకు ఎదురు తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. అది తట్టుకోలేక ఆయన షూటింగ్ సెట్స్ కు వచ్చి అందరి ముందు కొట్టేవాడని వెల్లడించింది. చిన్నతనంలోనే లైంగిక దాడులు ఎదుర్కొన్న నా తండ్రి నాపై అలాంటి దారుణాలకు పాల్పడ్డాడు. నా తల్లిని మరింత దారుణంగా చిత్రహింసలు చేసేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర ఇలా చేతికి ఏది దొరికితే దానితో దాడి చేసేవారు. కొన్నిసార్లు అమ్మను దారుణంగా తలను గోడకు వేసి మరి కొట్టేవాడు.
చిన్నతనంలో ఇలాంటి వేధింపులను ఎన్నో చూశా, భరించా.. నాపై జరుగుతున్న దాడి గురించి బయటకు చెప్పాలంటే భయపడిపోయా. అయితే చెన్నైకి వచ్చి నా కిళపై నేను నిలబడిన తర్వాత.. నాలో ఆత్మస్థైర్యం వచ్చింది. ఆయనకు ఎదురు తిరగడం మొదలుపెట్టా. ఆయన దాన్ని తట్టుకోలేక షూటింగ్ స్కేట్స్‌కు వచ్చి బాగా కొట్టేవాడు. ఓబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకు చాలా సహాయం చేసింది. నాతో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని ఆమె గమనించింది. నా నుంచి విషయం తెలుసుకుని నాకు ధైర్యం చెప్పింది. అలా మొదటిసారి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది ఖుష్బూ. తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. నేను కనుక్కోవాలని కూడా అనుకోలేదు. ఎప్పుడు ఆయన్ని కలవలేదు. ఆయన మరణించాడు అని తెలిసినవాళ్ళు చెప్పారంటూ ఖుష్బూ చెప్పుకొచ్చింది.