తాజాగా వచ్చిన కొత్త ఏడాది 2025 మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ తీసుకురానుంది. మెగా హీరోల నుంచి ఈ ఏడాది వరస పెట్టి సినిమాలు రానున్నాయి. మొదట.. రామ్ చరణ్‌కి గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి నుంచి విశ్వంభర కొంతకాలానికి.. పవన్ నుంచి ఓజి, హరహర వీరమల్లు సినిమాలు రిలీజ్ కనున్నాయి. కొత్త సంవత్సరం వచ్చేసింది. సంక్రాంతి నుంచి సినిమా సందడి మొదలైపోతుంది. స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్యూ కడుతున్నాయి. వీటిలో ఎక్కువగా మెగా స్టార్ హీరోల సినిమాలే ఉండడం విశేషం. నిజానికి 2024లో మెగా ఫ్యామిలీ లోని స్టార్ హీరోల నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో మెగా అభిమానులు కాస్త డీలపడిన ఈ ఏడాది మెగా అభిమానులకు పెద్ద పండుగ కానుంది.
తమ హీరోలు సినిమాలు వరుసపెట్టి రిలీజై దుమ్మురేపుతాయని నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. 2024 అంత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండి సినిమాలపై దృష్టి సారించలేకపోయాడు. దీంతో షూట్ పూర్తి కాలేదు. చిరు కూడా విస్వంభర కోసం వశిష్టతో సినిమా సెట్ చేసి షూట్ మొదలు పెట్టడానికి సమయం తీసుకున్నారు. ఇక చరణ్ గేమ్ ఛేంజర్ చాలా కాలం నుంచే పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. దీంతో.. మెగా ఫ్యామిలీ స్టార్ హీరోల నుంచి ఊహించిన రేంజ్‌లో సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే 2025లో మాత్రం సినిమాలన్నీ వరుసగా రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి. మొదట జనవరి 10న గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక చరణ్ నుంచి సినిమా రిలీజై దాదాపు మూడేళ్లు అవుతున్న క్రమంలో ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
దానికి తగ్గట్టుగా సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అభిమానుల అంచనాలను రెట్టింపు చేసింది. ఇక చిరంజీవి, వశిష్ట కాంబోలో తెరకెక్కనున్న విశ్వంభర సినిమా.. లెక్క ప్రకారం సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ.. చరణ్ గేమ్ ఛేంజర్ కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నారు చిరంజీవి. మెగాస్టార్ కెరీర్‌లోనే ఒకింత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సోషియ ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ట్రైలర్‌తో అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని.. సినిమా రిలీజ్ డేట్‌ని కూడా.. త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
ఇక ఏపి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి ఫుల్ బిజీగా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఓజి సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. 1989 – 90లలో జరిగే కథ ఆధారంగా ఓజీ సినిమాను రూపొందిస్తున్నారు. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్ని తెలిసిందే. సాహో లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సుజిత్ డైరెక్షన్‌లో ఓజితో.. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా చూడబోతున్నారు అభిమానులు. ఇక సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్లో పాల్గొననున్నారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
ఇక ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ మినహా అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి మరే స్టార్ హీరోల సినిమాలో రిలీజ్ సాధ్యం కాదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 సినిమా మాత్రం ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ రాజాసాబ్‌తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇలా ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ స్టార్ హీరోల నుంచి వచ్చే ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలు మెగా ఫ్యామిలీ వే కావడంతో మెగా ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.