” గేమ్ ఛేంజర్ ” సెన్సార్ టాక్.. అందరి నోట అదే మాట.. బ్లాక్ బస్టర్ పక్కానా.. ?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత.. చిరంజీవి ఆచార్య సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ లోను రామ్ చరణ్‌తో పాటు.. ఎన్టీఆర్ నటించడంతో చరణ్ సోలో హీరోగా ఓ సినిమా వస్తే చూడాల‌ని ఆర‌ట‌ప‌డుతున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇక చివరిగా వినయ విధేయ రామతో చరణ్ సోలో హీరోగా నటించాడు. ఇది రిలీజై కూడా నాలుగు సంవత్సరాలు దాటిపోతుంది. ఇలాంటి క్రమంలో చరణ్ సోలో హీరోగా.. సంక్రాంతి బ‌రిలో అడుగు పెట్ట‌నున్నాడు. శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ మూవీపై మెగా అభిమానులతో పాటు.. పాన్‌ ఇండియా లెవెల్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ ఏడాది జ‌న‌వ‌రి 10న‌ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్‌ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అభించింది. గేమ్ ఛేంజ‌ర్‌ చూసిన బోర్డ్ సభ్యులు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సినిమా చూసిన తర్వాత సెన్సార్ వారు.. మూవీ అద్భుతంగా ఉందని.. ఇంటర్వెల్, క్లైమాక్స్సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. ఈ సన్నివేశాలతో మూవీ బ్లాక్ బస్టర్ ట్రాక్ లో పడటం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారట.

అంతేకాదు ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేశారు మేకర్స్. 2:45 నిమిషాల నడివి తో ఆడియన్స్ ముందుకు గేమ్ ఛేంజర్ రానుంది. ఇక.. ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూడా.. ఈ సినిమాలో చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజైన టీజ‌ర్ ఆడియ‌న్స్‌లో మ‌రింత ఆశ‌క్తి హైప్ తెచ్చింది. ఏ రేంజ్ లో మూవీ ఉండబోతుంది.. ఎప్పుడు సినిమా చూస్తామా.. అంటూ ఆరాటపడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాతో చరణ్ బ్లాక్ పాస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.