టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకుంది. అలా గతేడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సీనియర్ స్టార్ హీరో ఫ్యాక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఈ మూవీలో హీరోయిన్‌గా మీను పాత్రలో మెప్పించింది. మరో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ కనిపించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యువర్.. ఒకవేళ మీరు గనక పవన్ కళ్యాణ్ బయోపిక్ రాస్తే టైటిల్ ఏమని పెడతారు అని అడగగా.. దానికి గ్లాస్ ఇస్ ఆల్వేస్ హాఫ్ ఫుల్.. అని టైటిల్ పెడతాను అని చెప్పుకొచ్చింది.
దానికి వివరణ ఇస్తూ పవన్ కళ్యాణ్ లోగో గ్లాస్ కాబట్టి.. నేను గ్లాస్ పెడతాను. ఇక పవన్ కళ్యాణ్ పాజిటివ్ యాటిట్యూడ్, పొలిటికల్ జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. టూ టర్మ్స్ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. అయినా ఎప్పుడు నిరాశ చెందరు.. కనుక ఆయన గొప్ప ఇన్స్పిరేషన్. మీరు నమ్మేదాన్ని ఫాలో అవ్వాలి అనడానికి ఆయనే ఉదాహరణ అంటూ పవర్ స్టార్ గురించి వివరించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అమ్మడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
If @Meenakshiioffl writes @PawanKalyan‘s biopic title is “ The Glass is Always Half Full ”#SankranthikiVasthunam#PawanKalyanpic.twitter.com/evyCDHScxP
— Milagro Movies (@MilagroMovies) January 21, 2025