తారక్ ఆ బ్లాక్ బస్టర్ ను రవితేజ చేయాల్సిందా.. మాస్ మహారాజ్ ఎలా మిస్ అయ్యాడంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్‌లో నటిస్తు బిజీబిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ‌నున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా.. ఏజెంట్ రోల్‌లో తార‌క్ కనిపించనున్న‌ట్లు టాక్. ఈ సినిమాతో పాటు త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్‌లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో జోష్‌లో ఉన్న తారక్ ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమైన సంగతి తెలిసిందే.

Temper: Amazon.in: Junior NTR, Kajal Aggarwal, Junior NTR, Kajal Aggarwal:  Movies & TV Shows

వరుస డిజాస్టర్లు అందుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ కెరీర్ డౌన్‌ఫాల్ అవుతున్న సమయంలో.. టెంపర్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు తారక్. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.35 కోట్లతో తెర‌కెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి లాభాల వర్షం కురిపించింది. ఈ సినిమాల్లో తారక్ పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లోనూ రీమేక్ చేశారు. హిందీలో ఈ సినిమా ఏకంగా రూ.400కోట్ల‌కు పైగా వసూలు కల్లగొట్టింది.

Power (2014) - IMDb

కాగా ఈ సినిమాను తారక్‌తో కాకుండా రవితేజతో చేయాలని మొదట భావించారట. టైటిల్, డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత అనుకోకుండా సినిమా తారక్‌కు వెళ్ళింది. 2014లో రవితేజతో ఈ సినిమా చేసేందుకు మెహర్ రమేష్ ప్లాన్ చేశారట. ఆ టైంలో వ‌క్కాంతం వంశీ చెప్పిన టెంపర్ కథ‌ నచ్చడంతో.. అదే స్క్రిప్ట్‌ను రవితేజ కోసం బ్లాక్ చేశారు. పవర్ టైటిల్‌తో సెట్స్‌పైకి రావ‌ల్సిన‌ ఈ సినిమా ఆగిపోయింది. అలా రవితేజ, మెహర్ రమేష్ కాంబో మిస్ అవ్వ‌డంతో బాబీ, రవితేజ కాంబోలో వచ్చిన సినిమాకు ఈ పవర్ టైటిల్ వాడుకున్నారు. ఇక పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమాకు టెంపర్ టైటిల్ పెట్టారు.