ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయి.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో సుహాసిని ఒకటి. సుహాసిని గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తన అందం,నటనతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో 50కి పైగా సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. అయితే సుహాసిని కేవలం నటిగానే కాదు.. దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటుకుంది. ఇప్పటికీ సుహాసిని పలు సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.
స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో వివాహం తర్వాత హీరోయిన్‌గా సినిమాలు చేయడం మానేసిన సుహాసిని.. పలు సినిమాల్లో కీలకపాత్రలో మాత్రమే మెరుస్తుంది. ఇదిలా ఉంటే సుహాసిని చెల్లి టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్. ఓ పాన్ ఇండియన్ బ్యూటీ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో అందరికీ తెలుసు. కానీ సుహాసినికి.. ఆ హీరోయిన్ చెల్లి అవుతుందని మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్.
ఎస్.. మీరు విన్నది నిజమే. శృతిహాసన్.. సుహాసిని ఇద్దరు అక్కచెల్లెళ్లు. సుహాసిని తండ్రి, కమల్ హాసన్.. సొంత అన్నా తమ్ముళ్లు. దీంతో కమల్ హాసన్ కు సుహాసిని కూతురి వరుస అవుతుంది. అలా శృతిహాసన్, సుహాసిని అక్కచెల్లెళ్లు. ఇక శృతిహాసన్ గురించి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్‌లు ఇచ్చి.. లక్కీ బ్యూటీగా మారింది. ఇక గతేడాది రిలీజ్ అయిన సలార్ తో పాన్ ఇండియన్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సలార్ 2తో పాటు.. మరికొన్ని పాన్ ఇండియా సినిమాల్లో శృతిహాసన్ నటిస్తూ బిజీగా గడుపుతుంది.