మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల పరంగా సినిమా రూ.200 కోట్ల షేర్‌వసూళను, రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌వసూళ్లను సాధించింది. కానీ.. బ్రేక్ ఈవెన్‌కి మాత్రం దగ్గరకు రాలేదు. ఫుల్ రన్ లో రూ.450 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తే కానీ ఇది సూపర్ హిట్ అయినట్లు కాదు. అయితే ఇప్పటివరకు కనీస 50 శాతం రికవరీ కూడా గేమ్ ఛేంజర్ సాధించలేకపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో రంగస్థలం తరహా సినిమాలో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించిన మేకర్స్.. ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్నారు. మూడో షెడ్యూల్ ఈ నెల 27న హైదరాబాద్‌లో జరగనుంది. కాగా ఈ స్కెడ్యూల్‌లో చరణ్ కూడా సందడి చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు టైటిల్‌గా పెద్ది ఖరారు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కి కూడా ఈ టైటిల్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ.. ఎందుకో టైటిల్‌ను చరణ్ ఫ్యాన్స్ ఇష్టపడడం లేదని.. ఏదో పవర్ మిస్ అయినట్లు అనిపిస్తుందని.. చరణ్ మాస్ ఇమేజ్ కి సరిపడా టైటిల్ కాదని.. వేరే టైటిల్ చూడమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక రంగస్థలం టైటిల్ ప్రకటించిన సమయంలో కూడా ఇలాంటి కామెంట్లు వినిపించినా.. అదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ఎలాంటి కమర్షియల్ సునామీ సృష్టించిందో తెలిసిందే. అలాగే పెద్ది టైటిల్ కూడా కథకి తగ్గట్టుగా ఉంటుంది. కనుక టైటిల్ పరంగా ఎలాంటి ఆందోళన అవసరం లేదంటూ మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ పలు ఆటల్లో ప్రావీణ్యత ఉన్న యువకుడుగా కనిపించనున్నాడని.. ఆయన పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉండనుందని సమాచారం. ఇక చరణ్‌కు చాలెంజింగ్ రోల్ దొరికితే తన నట విశ్వరూపాన్ని ఏ రేంజ్‌లో చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ఈ సినిమాతో ఆయనకు మంచి ఇమేజ్ సొంతమవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.