” సంక్రాంతికి వస్తున్నాం ” సంచలనం.. వెంకీ మామ ఆల్ టైం రికార్డ్ అదుర్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తాజా మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్గా రిలీజైంది. ఇక‌ రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.42 కోట్ల మేరే జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్‌షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు రూ.45 కోట్ల షేర్ వసూళను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దాంతో మొదలుకొని రోజురోజుకు అంచనాలను పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా.. కలెక్షన్లను కూడా అదే రేంజ్ లో కొన‌సాగిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తొలివారం పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే మరోసారి వెంకీ మామ కెరియర్ లోనే ఆల్ టైం రికార్డ్ ను సంక్రాంతికి వస్తున్నాం తన ఖాతాలో వేసుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. ఇంతకీ ఆ ఆల్ టైం రికార్డ్ ఏంటో.. కలెక్షన్ల లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు వీకే నరేష్, వీటిని గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలో మెప్పించారు. నటినటుల రెమ్యూనరేషన్, ప్రమోషన్ ఖర్చులు అంతా కలిపి సినిమా బడ్జెట్ రూ.80 కోట్ల వరకు జరిగింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ క్రమంలోని సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.85 కోట్లు కలెక్షన్లు రాబ‌ట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్ల‌డించాయి. కాగా ఈ సినిమా బ్రేక్ ఇవన్ తొలివారం రోజుల్లోనే దాటేసి అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టింది. అలా తాజాగా ఫస్ట్ వీక్ రన్ ముగిసే సరికి సినిమా ఏకంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. దీన్ని టీం అఫీషియల్ గా ప్రకటిస్తూ.. ప్రాంతీయ సినిమాల్లో ఇదే ఆల్ టైం రికార్డ్ అంటూ వెల్లడించింది. కాక వెంకటేష్ ఇప్పటివరకు నటించిన సినిమాలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా కూడా రఇదే కావ‌డం విశేషం.