టాలీవుడ్ నయా ట్రెండ్.. హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోస్.. లిస్ట్ ఇదే..!

ఇండ‌స్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరోసారి అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవ్వడం కామన్. ఆ కాంబోపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉంటాయి. మరోసారి ఆ కాంబో వెండి తెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంత ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కొన్నికాంబినేషన్స్ ఇప్పుడు సూపర్ క్రేజ్‌ దూసుకుపోతున్నాయి. అలా తెలుగు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య – బోయపాటి, వెంకటేష్ – అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ – అల్లుఅర్జున్, నాని – శ్రీ‌కాంత్ ఓద్దెల‌.. ఇప్పుడు చెప్పిన ఈ కాంబినేషన్స్‌పై ఆడియన్స్ కు మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి స్టార్ హీరోస్ ఆ ద‌ర్శ‌కుల‌ను లైన్లో పెట్టుకుని సినిమాలు నటించేందుకు సిద్ధమయ్యారు. ఇక తాజాగా నందమూరి నట‌సింహ బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 సెట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Balayya Plays Dual Role Again?

ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే అఖండ 2 పై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మ‌ల్లినేని.. వీరసింహారెడ్డి తో డిసెంట్ సక్సెస్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య గోపిచంద్‌తోను ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఇక మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఫ‌న్ అండ్‌ ఫ్రెస్టేషన్ రిలేటెడ్ సినిమాలు తీసి సక్సెస్‌లు అందుకుంటున్నడు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు మంచి రిజల్ట్ అందుకున్నాయి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మరోసారి ఈ కాంబో రిపీట్ చేశారు.

Director Sukumar's protégés follow his path - The South First

ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ ఈవెంట్‌లో వెంకటేష్ గారితో మరో 10 సినిమాలు చేస్తానంటూ అనిల్ రావిపూడి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ రెండు కాంబోలతో పాటు మరో ఇంటరెస్టింగ్ కాంబో త్రివిక్రమ్, అల్లు అర్జున్. వీళ్లిద్దరి కాంబోలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ క్రమంలోనే బ‌న్నీ.. త్రివిక్రమ్‌తో నాలుగో సినిమా తెర‌కెక్కించనున్నారు. అలాగే అల్లు అర్జున్ మరో లక్కీ డైరెక్టర్ సుకుమార్ తో ఇప్పటికే నాలుగు సినిమాలు పూర్తయ్యాయి.

A furious and disheartened Srikanth Odela announces the title of Nani's next

వీరితో పాటు నాని హీరోగా.. శ్రీకాంత్ ఓద్దెల డైరెక్ష‌న్‌లో పారడైజ్ సినిమాతో ఈ కాంబోను రిపీట్ చేయనున్నాడు. రామ్ చరణ్.. సుకుమార్ తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్లో ఇప్పటికే సక్సెస్ అందించిన స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోస్ మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ టాలీవుడ్ లో కొనసాగుతుంది. మరి ఈసారి కూడా వీళ్ళ కాంబోలో వచ్చే సినిమాలు అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయో లేదో వేచి చూడాలి.