అఖండ 2: లక్షలాది అఘోరాల మధ్య బాలయ్య తాండవం..!

నందమూరి నట‌సింహం బాలయ్య హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మహా కుంభమేళాకు వెళ్లిన‌ కోట్లాదిమంది జన సందోహం, లక్షలాదిమంది అఘోరాల మధ్య షూటింగ్ చేయనున్నాడని.. ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రయాగలో జరుగుతున్న అద్భుత ఉత్సవానికి సగటుకు రోజు యాభై లక్షలకు పైన భక్తులు హాజరై సందడి చేస్తున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవత మూర్తుల ఊరేగింపులు భక్త పార్వశ్యాల నడుమ చూసేందుకు రెండు కళ్ళు చాలవ‌న్నట్లుగా సంబరాలు జరుగుతున్నాయి.

అఖండ 2 " బాలయ్య ఎంట్రీ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.. -  Telugu Journalist

ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళా మొత్తం దేశ జనాభాలో పాతిక శాతానికి పైగా పాల్గొంటారని సమాచారం. అలాంటి చోట షూటింగ్ అంటే నిజంగానే బోయపాటికి పెద్ద సవాలు. బాలకృష్ణని తీసుకువెళ్లి మాత్రం అక్కడ షూటింగ్ చేయలేడు. ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన ఫొటోస్ తీసుకోవడంతో పాటు.. కొన్ని సన్నివేశాలు కూడా అక్కడే షూట్ చేస్తారని తెలుస్తోంది. మళ్ళీ ఇంకోసారి వెళ్లే అవకాశం ఉందట. అఖండ 2 కథ మొత్తం బాలయ్య చుట్టే తిరగనుంది. ఈ క్రమంలోనే లోక వినాశనానికి పూనుకున్న దుష్టశక్తులను అధిగమించేందుకు అపారమైన దివ్య శక్తులను పోగు చేసుకునే క్రమంలో.. కీలకమైన ఎపిసోడ్‌ను ఈ బ్యాక్ డ్రాప్‌లో బోయపాటి రూపొందించనున్నారని.. తెరమీద ఈ సీన్ చూసేటప్పుడు గూస్ బంప్స్ కాయమనేలా సన్నివేశాలు ఉంటాయని సమాచారం.

Akhanda 2: అఖండ 2కి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా.? బాలయ్య ముహూర్తమే ఫిక్సా.? -  Telugu News | Nandamuri Balakrishna Akhanda 2 Movie Latest Update Telugu  Heroes Photos | TV9 Telugu

సెప్టెంబర్లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న అఖండ 2 ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైం కి రిలీజ్ చేసేలా బోయపాటి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారని.. డాకు మహారాజ్ రిలీజ్ అయింది కనుక.. బాలకృష్ణ పూర్తి డేట్లు అఖండ 2కి కేటాయించడం ఖాయం అంటూ తెలుస్తుంది. సింహా, లెజెండ్, అఖండలతో ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న ఈ కాంబోపై ఆడియన్స్ లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక థ‌మన్ అయితే బాలయ్యకు ఏకంగా ఐదు సార్లు చార్జ్‌ బస్టర్గా బీజీఎంలో పాటలు అందించారు. ఈ క్రమంలోనే వీళ్ళ ముగ్గురి కాంబోలో రాబోతున్న సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. బోయపాటి ఆడియన్స్ అంచ‌నాలకు రీచ్ అవుతారు లేదో వేచి చూడాలి.