నందమూరి నటసింహం బాలయ్యకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక రామారావు నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరస బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక నందమూరి బాలయ్య తనయుడుగా మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్‌గా చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ మరింత ఆలస్యం అవనుందని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరింత నిరాశకు గురవుతున్నారు.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ సినిమా నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో రాబోతున్న సినిమా పై పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక చాలా కాలం క్రిందట మోక్షజ్ఞ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటూ సెప్టెంబర్ లో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం బయటకి రాలేదు. ఇలాంటి క్రమంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల రిలీజ్‌కు మరింత ఆలస్యం అవుతుందని.. ఫిబ్రవరిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సినిమాలు ప్రారంభిస్తారని యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం ఉందని.. త్వరలోనే మోక్షజ్ఞ విదేశాలకు వెళ్లబోతున్నాడు అంటూ అక్కడే సినిమా గురించి చర్చలు జరుగుతాయని తెలుస్తుంది.
మోక్షజ్ఞ ఇంకా తన సినిమా విషయంలో కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు అంటూ టాక్ నడుస్తుంది. తన ఫస్ట్ సినిమా ఎవరితో చేయాలనే విషయంలో మోక్షజ్ఞ నిర్ణయానికి రాలేకపోతున్నాడని.. అందుకే సినిమా ప్రారంభించే విషయంలోనూ ఇంత సమయం తీసుకుంటున్నాడని.. ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ప్రశాంత్ వర్మ ఎప్పుడూ మోక్షజ్ఞతో సినిమా కోసం కథలు సిద్ధం చేసి ఉంచాడట. ప్రశాంత్ కథను మోక్షజ్ఞ ఫైనల్ చేయడమే ఆలస్యం.. అంతా ఓకే అయితే ఫిబ్రవరిలో సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తుంది. అయితే మోక్షజ్ఞ విదేశాలకు వెళుతున్నాడు అన్న వార్తల్లో నిజం ఏంటో తెలియదు కానీ ..ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. సినిమా విషయంలో ఇంకెంత ఆలస్యం చేస్తారో.. అసలు ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందో లేదో అని సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.